Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

Advertiesment
Hari Hara Veeramallu release date poster

దేవీ

, శనివారం, 21 జూన్ 2025 (08:15 IST)
Hari Hara Veeramallu release date poster
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా కనువిందు చేయనున్న ప్రతిష్టాత్మక చిత్రం 'హరి హర వీరమల్లు' జూన్ 12న విడుదల కావాల్సింది. కానీ సాంకేతిక కారణాలతో సినిమాను వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ సినిమా జులై 4న రాబోతుందని రకరకాల వార్తలు కూడా వచ్చాయి. దానిపై చిత్ర నిర్మాత కూడా ఇలాంటి వార్తలు రాయవద్దని మీడియాను వేడుకున్నారు. అప్పటికే సోషల్ మీడియాలో వచ్చేశాయి.
 
కనుక నేడు ఈ సినిమా విడుల తేదీని ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేశారు. జూలై 24న సినిమాను విడుదలచేస్తున్నట్లు తెలిపారు. దానితోపాటు చిత్ర కథ గురించి కొద్దిగా క్లారిటీ ఇచ్చారు.  ఒకరు అధికారం కోసం పోరాడుతారు. 
 
ఒకరు ధర్మం కోసం పోరాడుతారు. వారసత్వాల ఘర్షణ ప్రారంభమవుతుంది. సత్యం, విశ్వాసం మరియు స్వేచ్ఛ కోసం జరిగే పోరాటానికి సాక్షులుగా ఉండండి. ఒక చారిత్రాత్మక అనుభవం ఎదురుచూస్తోంది అని తెలిపారు.
 
కాగా, 'హరి హర వీరమల్లు' చిత్రం సంబంధించిన అన్ని ప్రమోషన్లు దాదాపు పూర్తయ్యాయి. మరి జులైలో ఏదైనా పెద్ద ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన 'హరి హర వీరమల్లు'లో బాబీ డియోల్ ముఖ్య పాత్ర పోషించారు.
 
తారాగణం: పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నరా ఫతేహి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌