ఎన్టీఆర్ ఆడియో రిలీజ్ తేదీ ఫిక్స్.. ఆ తేదీన.. ఆ ఊరిలోనే...

Webdunia
గురువారం, 13 డిశెంబరు 2018 (09:40 IST)
స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. "కథానాయకుడు", "మహానాయకుడు" అనే పేర్లతో రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ తేదీని ఖరారు చేశారు. క్రిష్ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్నారు. 
 
రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రం "క‌థానాయకుడు" పేరుతో జ‌న‌వ‌రి 9న విడుద‌ల కానుండ‌గా, "మ‌హానాయ‌కుడు" పేరుతో జ‌న‌వ‌రి 24న రిలీజ్ కానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలను చిత్ర యూనిట్ వేగవంతం చేసింది. ఇప్పటికే చిత్రానికి సంబంధించి రెండు సాంగ్స్ విడుద‌ల చేసిన టీం ఈ సినిమా ట్రైలర్‌ను డిసెంబరు 16న హైదరాబాద్‌లో ఏర్పాటుచేయనున్న కార్యక్రమంలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. 
 
ఇక డిసెంబరు 21న నిమ్మకూరులో ఆడియో విడుదల వేడుకను ఘనంగా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. కీర‌వాణి స్వ‌రాలు స‌మాకూరుస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకంగా విద్యాబాలన్‌, నారా చంద్రబాబు నాయుడుగా రానా, హరికృష్ణగా కల్యాణ్‌రామ్, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్‌, జయప్రదగా హన్సిక, జయసుధగా పాయల్‌ రాజ్‌పుత్‌, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సావిత్రిగా నిత్యా మేనన్‌, ప్రభగా శ్రియతో పాటు మరికొంతమంది సినీ ప్రముఖులు నటిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments