Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవసరాల శ్రీనివాస్ కొత్త చిత్రం టైటిల్ ఇదే...

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (17:18 IST)
సినిమా మీద ఉండే విపరీతమైన ప్రేమతో అమెరికాలో చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వదులుకొని హైదరాబాద్‌కు వచ్చేసిన నటుడు అవసరాల శ్రీనివాస్. ఈయన మొదటి సినిమా ‘అష్టాచమ్మా’తోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఆయన చాలా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ చేసినప్పటికీ, "ఊహలు గుసగుసలాడే" సినిమాతో తనలోని దర్శకుడిని కూడా నిరూపించుకునేసారు.
 
కాగా.. గత యేడాది ఆయన ప్రధాన పాత్రధారిగా నటించి విడుదలైన "బాబు బాగా బిజీ" సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న అంచనాలను అందుకోలేకపోవడంతో మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ వస్తున్న అవసరాల శ్రీనివాస్ తాజాగా ఎన్నారై (నాయనా రారా ఇంటికి అనేది ఉప ట్యాగ్) అనే సినిమాలో ప్రధాన పాత్రధారిగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ బుధవారం (ఫిబ్రవరి 20) నుంచి ప్రారంభమైంది.
 
మంచు లక్ష్మి కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించనున్నారు, వీరితోపాటు మహతి, నాగబాబు కూడా ప్రత్యేక పాత్రలలో కనిపించనున్నారు. కేఆర్ ప్రదీప్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాల శేఖర్ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తుండగా ఈ చిత్రంలోని పాటలన్నిటినీ సిరివెన్నెల సీతారామశాస్త్రి రాస్తూండగా.. ఆయన కుమారుడు యోగేశ్వర శర్మ సంగీతం సమకూర్చడం మరో విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

భారీ వర్షాలకు ఢిల్లీ అస్తవ్యస్తం - ఠాణా పైకప్పు కూలి ఎస్ఐ మృతి

ప్రియుడితో వెళ్లిపోయిన కుమార్తె .. కుటుంబం మొత్తం ఆత్మహత్య..

నువ్వు చనిపోవాలంటూ భర్త వేధింపులు - నవ వధువు ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments