Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిగురుపాటి జయకుమార్ హత్య కేసు : నటుడు సూర్య పింగ్ పింగ్ పంగ్‌కు లింకు?

Advertiesment
Chigurupati Jayaram Murder Case
, గురువారం, 14 ఫిబ్రవరి 2019 (13:17 IST)
కోస్టల్ బ్యాంకు ఛైర్మన్, ఎన్నారై, ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసు రోజుకో ములుపు తిరుగుతోంది. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా పోలీసులు రోజుకో ఆసక్తికర విషయం వెల్లడవుతోంది. అలాగే, కేసుతో సంబంధం ఉన్నవారికి ఉచ్చు బిగుస్తున్నారు. తాజాగా ఈ కేసులో టాలీవుడ్ నటుడు సూర్య పింగ్ పంగ్‌కు సంబంధం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అతన్ని బంజారా హిల్స్ పోలీసులు విచారణ జరిపారు. 
 
ఈయన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నటించిన 'ఆ నలుగురు' చిత్రంలో హీరోకు కుమారుడుగా నటించాడు. దీనికి కారణం లేకపోలేదు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి, సూర్యలు మంచి స్నేహితులు కావడమే. జయరాం హత్య జరిగిన రోజున సూర్యతో రాకేశ్ రెడ్డి మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. సూర్యకు రాకేశ్‌ రెడ్డితోపాటు శిఖా చౌదరితో కూడా పరిచయం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే సూర్యను పోలీసులు విచారించారు. జయరాం మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి కృష్ణా జిల్లా నందిగామకు తరలించేందుకు సూర్య సహాయం తీసుకున్నారా? అనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
 
మరోవైపు, జయరాం హత్య కేసు ఇద్దరు పోలీస్ అధికారుల మెడకు చుట్టుకుంటుంది. హత్య జరిగిన తర్వాత మృతదేహాన్ని తరలించడంతోపాటు, హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడంలో నల్లకుంట సీఐ శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి సహకరించినట్టు నిందితుడు రాకేశ్‌రెడ్డి వెల్లడించడం మరోసారి చర్చనీయాంశమైంది. వీరి పాత్రపై వచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు ఆ ఇద్దరు అధికారులను ఆయా పోలీస్ కమిషనర్లు బదిలీ చేసి, అంతర్గత విచారణ జరుపుతున్నారు. 
 
హత్య చేసిన తర్వాత సీఐ శ్రీనివాస్‌తో 13 సార్లు, ఏసీపీ మల్లారెడ్డితో 29 సార్లు ఫోన్‌లో మాట్లాడినట్టు రాకేశ్ రెడ్డి మాట్లాడారు. ఈ మేరకు రాకేశ్ రెడ్డి కాల్‌డేటాను పరిశీలించిన పోలీసులు ఈ విషయాన్ని నిర్ధారించారు కూడా. జయరాం మద్యం తాగి రోడ్డు ప్రమాదానికి గురైనట్టు సీన్ ఉండాలని అందుకు.. అతని నోట్లో, ఒంటిపై మద్యం పోయాలని సదరు అధికారులు సలహా ఇచ్చినట్టు రాకేశ్‌రెడ్డి విచారణలో వివరించినట్టు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సచినే అవుతావో.. సోంబేరి అవుతావో నీ ఇష్టం... ప్రేమికుల రోజు 'మజిలీ' టీజర్ టచ్(Video)