అర్జున్ రెడ్డి చిత్రం తరువాత విజయ్ దేవరకొండ లైఫ్ స్టైలే మరిపోయింది. దానికి తోడుగా మరో సినిమా చేశారు. అదే నండి.. గీతా గోవిందం చిత్రం.. అసలు ఈ సినిమా గురించి మాటల్లో చెప్పలేం. ఈ సినిమా రీలిజ్ తరువాత ఎక్కడ చూసినా దీని గురించే మాట్లాడుతున్నారు. అంతేకాదు.. ఈ చిత్రంలోని 'ఇంకేం ఇంకేం కావాలి' సాంగ్‌కి పిచ్చ పిచ్చగా ఫాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ సాంగ్ ఎక్కడ విన్నా కూడా విజయ్ దేవరకొండే గుర్తుకు వస్తారు. ప్రస్తుతం విజయ్ ఓ కొత్త చిత్రం చేస్తున్నాడు. అందులో విజయ్ 8 ఏళ్ల అబ్బాయికి తండ్రిగా కనిపించనున్నారు.
అందుకు కారణమేమిటో తెలుసుకోవాంటే.. చిత్రాన్ని చూడాల్సిందేనని దర్శకుడు క్రాంతి మాధవ్ చెప్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం 15 రోజుల చిత్రీకరణ పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్‌కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' చిత్రం తర్వాత క్రాంతి మాధవ్‌కు మంచి పేరు తెచ్చే చిత్రమవుతుందని తన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇందులో విజయ్.. సింగరేణి కార్మికులకు యూనియన్ లీడర్‌గా నటిస్తున్నాడు. మరోవైపు ప్రేమకథ కూడా ఉంది. ఈ చిత్రంలో రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కాథరిన్, ఇజబెల్లి హీరోయిన్స్‌గా నడిస్తున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్వ రాజేష్ తన పాత్ర తాలూకు షెడ్యూలు పూర్తి చేసింది. అలానే గోపిసుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కె. ఎస్ రామారావు గారు నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉండగా విజయ్ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ ప్యాచ్ ఫైనల్ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్ స్టూడెంట్ లీడర్‌గా కనిపించనున్నాడు.