Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాజల్‌ను పెళ్ళి చేసుకోమని ఒత్తిడి తెస్తున్నారట.. ఎవరు..?

Advertiesment
Kajal Agarwal
అగ్రహీరోల సరసన నటించి టాప్ 10 హీరోయిన్లలో ఒకరుగా ఉన్నారు సినీ నటి కాజల్ అగర్వాల్.
ఎన్నో సినిమాల్లో బిజీ బిజీగా ఉన్న కాజల్ పెళ్ళి విషయమై హాట్ టాపిక్‌గా మారుతోంది. కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్‌కు ఇప్పటికే పెళ్ళయిపోయింది. చెల్లెలికి పెళ్ళయి.. అక్కకు పెళ్ళి కాకపోవడంతో కుటుంబంలో అందరూ కాజల్ పెళ్లి గురించే అడుగుతున్నారట.
 
అయితే కాజల్ చెప్పిన ప్రతి మాటను గౌరవిస్తున్నారట ఆయన తండ్రి వినయ్ అగర్వాల్. కానీ తల్లి సుమన అగర్వాల్ మాత్రం కాజల్‌కు పెళ్ళి చేసి తీరాలని నిర్ణయానికి వచ్చారట. సినిమా కెరీర్లో ముందుకు వెళ్ళాలన్న ఆలోచనలో ఉన్నారట కాజల్. 
 
అందుకే ఇప్పుడిప్పుడే పెళ్ళి వద్దని మరి కొన్ని సినిమాల్లో నటించిన తరువాత పెళ్ళి చేసుకోవాలన్నది కాజల్ ఆలోచన. ఈమె ఆలోచనకు తండ్రి ఒకే అంటున్నాడు కానీ తల్లి ఏ మాత్రం ఒప్పుకోవడం లేదట.
 
పెళ్ళి చేసుకొని సినిమాల్లో నటించమని కాజల్ పై తల్లి ఒత్తిడి తెస్తోందట. ఇప్పటికే కాజల్‌కు 33యేళ్ళు పూర్తయి 34 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోంది. జూలై నెలలో తన పుట్టిన రోజు వేడుకలు జరుగబోతున్నాయి. పుట్టిన రోజు పూర్తి చేసుకున్న రెండు మూడునెలలోపల తమ బంధువుల అబ్బాయికి ఇచ్చి కాజల్‌ను పెళ్ళి చేయాలని తల్లి సుమన అగర్వాల్ చూస్తోందట. మరి కాజల్ తల్లి మాట వింటుందో లేక పెళ్ళి చేసుకోకుండా ఉండిపోతుందో చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తండ్రి కాబోతున్న అర్జున్ రెడ్డి?