Webdunia - Bharat's app for daily news and videos

Install App

భీష్మ టీజ‌ర్ రిలీజైంది, టాక్ ఏంటి?

Webdunia
మంగళవారం, 12 నవంబరు 2019 (21:05 IST)
నితిన్, రష్మిక మందన, వెంకీ కుడుముల కాంబినేషన్లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న చిత్రం 'భీష్మ'. ఈ చిత్రం తొలి వీడియో దృశ్యాలను ఇటీవల విడుదల చేసింది చిత్రం యూనిట్. 'కథానాయకుడు నితిన్ 'నా లవ్ కూడా విజయ్ మాల్యా లాంటిదిరా...కన్పిస్తుంటుంది కానీ క్యాచ్ చెయ్యలేం' అంటూ చెప్పే సంభాషణలతో, కేవలం కొద్ది క్షణాలే కనిపించే ఈ వీడియోకి ప్రేక్షకాభిమానులనుంచే కాక, సామాజిక మాధ్యమాలలో సైతం విశేషమైన ప్రాచుర్యం లభించింది. 
 
కథానాయకుడు నితిన్ ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా కృతఙ్ఞతలు తెలిపారు. ఇటీవల చిత్రం రాజమండ్రి పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న చిత్రం విడుదలయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 
 
చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ... ఈ చిత్రం తొలి వీడియో దృశ్యాలను సుప్రసిద్ధ దర్శకుడు, మా గురూజీ త్రివిక్రమ్ గారి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయటం జరిగింది. వీటికి ప్రేక్షకాభిమానులనుంచి అద్భుతమైన స్పందన లభించింది. 
 
నితిన్,రష్మిక జంట చూడముచ్చటగా ఉందన్న ప్రశంసలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో దృశ్యాలు విపరీతంగా వైరల్ అయ్యాయి. వీటికి ముందు ప్రచార చిత్రాలను దీపావళి పర్వదినాన విడుదలచేయటం జరిగింది. వీటికి కూడా ప్రేక్షకాభిమానులనుంచి విశేషమైన స్పందన లభించింది.
 
'భీష్మ' చిత్ర కధ, కధనాలు, సన్నివేశాలు, సంభాషణలు చాలా కొత్తగా ఉంటాయి. ప్రతి అబ్బాయి నితిన్ గారి క్యారెక్టర్‌కి కనెక్ట్ అయ్యేవిధంగా డిజైన్ చెయ్యబడింది. అలాగే ప్రతి యువతి కూడా రష్మిక క్యారెక్టర్‌కి కనెక్ట్ అవుతుంది. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. వినోద ప్రధానంగా సాగుతుంది అని తెలిపారు దర్శకుడు వెంకీ కుడుముల.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments