Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వయంభూ కోసం కత్తి యుద్ధం చేస్తూ సవ్యసాచిగా మారిన హీరో నిఖిల్

Webdunia
శనివారం, 4 నవంబరు 2023 (16:50 IST)
Nikhil practice
హీరో నిఖిల్ ల్యాండ్‌మార్క్ 20వ చిత్రం ‘స్వయంభూ. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం వియత్నాంలో దాదాపు ఒక నెల రోజులు కఠోర శిక్షణ తీసుకున్నారు నిఖిల్. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌కు చెందిన భువన్,  శ్రీకర్ నిర్మిస్తున్న ఈ ఎపిక్ ఒడిస్సీలో లెజెండరీ యోధుని పాత్రను పోషించడానికి ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకున్నారు  నిఖిల్. నమ్మశక్యం కాని యుద్ధ సన్నివేశాలతో కూడిన ఈ చిత్రంలో నిఖిల్ కొన్ని అద్భుతమైన స్టంట్స్ చేయనున్నారు.
 
ట్రైనింగ్ సెషన్ పూర్తయిన వెంటనే, నిఖిల్ కత్తి యుద్ధం మొదలైనవాటిలో ప్రోగా మారడానికి ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. కఠినమైన ప్రాక్టీస్ సెషన్ నిఖిల్‌ను సవ్యసాచి గా చేసింది. ఇప్పుడు రెండు చేతులతో కత్తియుద్ధం చేయగలుగుతున్నారు. నిఖిల్ షేర్ చేసిన వీడియో... కత్తి యుద్ధంలో అతని నైపుణ్యాన్ని చూపుతుంది.
 
బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో దూసుకెళ్తున్న సంయుక్త ఈ చిత్రం కథానాయికగా నటిస్తోంది. స్వయంభూ నిఖిల్ కెరీర్ లోనే హై బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతోంది.
 
‘స్వయంభూ’ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతోంది. రవి బస్రూర్ సంగీతం అందించగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎం ప్రభాహరన్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వాసుదేవ్ మునెప్పగారి డైలాగ్స్ అందిస్తున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్టు.. 14 రోజుల రిమాండ్

డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివస్తుందన్న భయంతోనే జగన్ డుమ్మా : మంత్రి అనిత

కలెక్టరేట్‌లో తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న కానిస్టేబుల్.. ఎక్కడ?

నలుగురు వికలాంగ కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి.. ఎక్కడ?

నల్లవాగును కబ్జా చేసి వెంచర్ వేసిన వైకాపా నేత - హైడ్రా నోటీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments