Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరంగల్‌లో నాని శ్యామ్ సింగ రాయ్ రాయల్ ఈవెంట్

Warangal
Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (17:28 IST)
Nani, Sai Pallavi
నాని శ్యామ్ సింగ రాయ్ నుంచి వస్తున్న ప్రతీ ఒక్క అప్డేట్ సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 24న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు.
 
ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పటినుంచి ఇప్పటి వరకు సినిమా మీద అంచనాలు పెరుగుతూనే వచ్చాయి. ఇక టీజర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. మిక్కీ జే మేయర్ సంగీత సారథ్యంలో విడుదలైన పాటలకు మంచి ఆదరణ లభించింది. రానున్న రోజుల్లో  సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలను చిత్రయూనిట్ మరింత పెంచనుంది. తాజాగా శ్యామ్ సింగ రాయ్ రాయల్ ఈవెంట్‌కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు.
 
వరంగల్‌లోని రంగలీల మైదానంలో ఈ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ఏర్పాటు చేయబోతోన్నారు. నానితో పాటు చిత్రయూనిట్ అంతా కూడా ఈ ఈవెంట్‌‌లో పాల్గొననున్నారు.
 
సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథను అందించారు. మెలోడి స్పెషలిస్ట్ మిక్కీ జే మేయర్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తుండగా.. జాన్ వర్గీస్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 
జాతీయ అవార్డు గ్రహీత కృతి మహేష్, ప్రతిభా వంతుడైన యశ్ మాస్టర్ ఈ చిత్రంలోని పాటలకు కొరియోగ్రఫర్లుగా పని చేస్తున్నారు.
 
రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం వంటి వారు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రం దక్షిణాది అన్ని భాషల్లో డిసెంబర్ 24న విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments