Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలాల నాటి ప్రేమ‌ను -యదలో మౌనం-తో ఆవిష్క‌రించిన శ్రీదేవి, శివాజీ గణేశన్ వార‌సులు

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (17:02 IST)
Lakshmi Devi
శ్రీదేవి మేనకోడలు, శివాజీ గణేశన్ మనవడు జంటగా పద్మిని మనవరాలు తీసిన‌ మ్యూజిక్ వీడియో ''యదలో మౌనం`. 1206 నుంచి 2018 వ‌ర‌కు పరంప‌ర‌గా ప్రేమ‌కోసం పుట్టిన‌ట్లున్న ఇరువురు ప్రేమికుల‌ను చివ‌రికి ఎలా క‌లిపార‌నే అంశంతో దీని తెర‌కెక్కించాడు. సంగీతం, సాహిత్యం అల‌రించాయి. 
 
పురస్కారాలు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఫిల్మ్ మేకర్ దివంగత నటి, భరతనాట్యం కళాకారిణి పద్మిని రామచంద్రన్ మనవరాలు లక్ష్మీ దేవి రూపొందిస్తున్న మ్యూజిక్ వీడియో 'యదలో మౌనం'. ఇందులో నడిగర్ తిలకం శివాజీ గణేశన్ మనవడు దర్శన్, శ్రీదేవి మేనకోడలు శిరీష జంటగా కనిపించనున్నారు. శివాజీ గణేశన్, పద్మిని సుమారు 50 చిత్రాల్లో జంటగా నటించారు. ఇప్పుడు పద్మిని మనవరాలి దర్శకత్వంలో శివాజీ గణేశన్ మనవడు ఓ మ్యూజిక్ వీడియో చేయడం విశేషం. ఇంకా విఘ్నేష్ శివసుబ్రమణియన్, వేస్త చెన్ ఇతర తారాగణం.
 
Shirisha (Sridevi's niece) and Darshan Ganesan
కొత్త సంగీత దర్శకుడు వరుణ్ మీనన్‌తో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు అచ్చు రాజమణి స్వరపరిచిన బాణీతో ఈ మ్యూజిక్ వీడియో రూపొందుతోంది. ఈ పాటను అచ్చు రాజమణి ఆలపించారు. సూర్య హీరోగా నటించిన 'బందోబస్తు'కు సినిమాటోగ్రఫీ అందించిన అభినందన్ రామానుజం ఈ మ్యూజిక్ వీడియోకు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ పాటకు ఆంటోనీ గొంజాల్వెజ్ ఎడిటర్. ఆయన దర్శకులు శంకర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ సినిమాలకు పని చేశారు. 
 
ఆస్కార్ పురస్కారాల్లో 'లైఫ్ యాక్షన్ షార్ట్' కేటగిరీలో పోటీ పడుతున్న 'వెన్ ద మ్యూజిక్ చేంజెస్' తర్వాత లక్ష్మీ దేవి దర్శకత్వంలో ఈ మ్యూజిక్ వీడియో రూపొందింది. ఇప్పుడు ఐ ట్యూన్స్, ఆదిత్య మ్యూజిక్ ఛానళ్లలో 'వెన్ ద మ్యూజిక్ చేంజెస్' అందుబాటులో ఉంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Navy Officer Murder Case: వెలుగులోకి షాకింగ్ నిజాలు.. మృతదేహంపైనే నిద్ర..

అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం... కేశినేని శివనాథ్

Hyderabad Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అడిషనల్ డీఎస్పీ మృతి

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments