Webdunia - Bharat's app for daily news and videos

Install App

22 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో 'శ్యామ్ సింగరాయ్' సందడి

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (18:46 IST)
నేచురల్ స్టార్ నాని ద్విపాత్రాభినయంలో సాయిపల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా వచ్చిన చిత్రం "శ్యామ్ సింగరాయ్". గత నెల 24వ తేదీన పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాలం, హిందీ భాషల్లో విడుదలై, మంచి పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ చిత్రం ఈ నెల 22వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. 
 
నిర్మాత వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చగా, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించారు. కోల్‌కతాలో 70వ దశకంలో కొనసాగిన దేవదాసీ వ్యవస్థ చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఆ కాలాన్ని ప్రతిబింభిస్తూ భారీ సెట్స్ వేసి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో దేవదాసిగా సాయిపల్లవి నటించారు. 
 
ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఏపీలో సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు, 50 శాతం ఆక్యుపెన్సీ వంటి ఆంక్షలు ఉన్నప్పటికీ మంచి కలెక్షన్లను రాబట్టింది. పైగా, నాని ఖాతాలో ఈ చిత్రం ద్వారా మరో విజయం వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఫలితంగా శుక్రవారమైన 22వ తేదీ నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్ ఓటీటీలో రిలీజ్ కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...

YS Viveka Case: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్ సునీతారెడ్డి.. ఈ కేసు క్లోజ్ కాకపోతే?

Midhun Reddy: ఏపీ మద్య కుంభకోణం-బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డి పిటిషన్

జగన్ ఆ విషయంలో నిష్ణాతుడు.. లిక్కర్ స్కామ్‌పై సమాధానం ఇవ్వాలి.. వైఎస్ షర్మిల

జూలై 26 నుంచి 31 వరకు సింగపూర్‌లో చంద్రబాబు పర్యటన.. ఎలా సాగుతుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments