Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాన్ ఇండియా ఫిల్మ్... ఫస్ గయే యారో, ప్రీ రిలీజ్ ఫంక్షన్

Advertiesment
పాన్ ఇండియా ఫిల్మ్... ఫస్ గయే యారో, ప్రీ రిలీజ్ ఫంక్షన్
విజ‌య‌వాడ‌ , బుధవారం, 19 జనవరి 2022 (14:10 IST)
ఇది పాన్ ఇండియా ఫిల్మ్ "ఫస్ గయే యారో"...ఈ హర్రర్ ఎంటర్టైనర్ హైదరాబాద్ బిర్యానీలాంటి పసందైన వినోదం పంచుతుంది అని చిత్ర యూనిట్ చెపుతోంది. ఈనెల  దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 
 
 
పాన్ ఇండియా ఫిల్మ్ "ఫస్ గయే యారో". "అబ్ ఆయేగీ కిస్కీ బారి?" ట్యాగ్ లైన్ తో ఆర్.డి.జి.ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ప్రముఖ నిర్మాత రూపేష్ డి.గోహిల్ నిర్మించిన ఈ చిత్రానికి యూసఫ్ సర్తి దర్శకత్వం వహించారు. డెక్కన్ సూపర్ స్టార్ మస్త్ అలీ, అజీజ్ నజీర్, ఏలీన టుతేజా, రేష్మా బరి, నజియా ఖాన్, నిర్మల్ దిలీప్ రాయ్ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రముఖ దర్శకుడు సయ్యద్ హుస్సేన్ సారధ్యంలో హైదరాబాద్-ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించిన "ఫస్ గయే యారో" ప్రి-రిలీజ్ ఈవెంట్ పండగ వాతావరణాన్ని తలపించింది. ప్రఖ్యాత నిర్మాణ-పంపిణీ సంస్థ "ఫస్ గయే యారో" చిత్రాన్ని దేశవ్యాప్తంగా విడుదల చేస్తోంది.
 
 
ఫస్ట్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇఫ్తేకర్ షరీఫ్, తెలంగాణ స్టేట్ మైనారిటీ చైర్మన్ సయ్యద్ అక్బర్ హుస్సేన్, ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ (గోపి) ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఈ వేడుకలో నిర్మాతలు రూపేష్ డి.గోహిల్- ఎమ్.విజయలక్ష్మి-ఓం ప్రకాష్ భట్-ధనంజయ్ మాసూమ్, సహ నిర్మాత సోను గుప్తా, హీరో మస్త్ అలీ, దర్శకుడు యూసఫ్ సర్తి తదితర చిత్ర బృందం పాలుపంచుకుంది. 
 
 
డెక్కన్ (హైద్రాబాద్ హిందీ) సినిమాలకు రోజురోజుకు విపరీతమైన ఆదరణ పెరుగుతోందని, ఈ చిత్రాలకు రాయితీలిచ్చి మరింత ప్రోత్సాహించాల్సిన అవసరం ఉందని వక్తలు పేర్కొన్నారు. హర్రర్ ఎంటర్టైనర్ గా రూపొందిన "ఫస్ గయే యారో" కచ్చితంగా సంచలన విజయం సాధిస్తుందని వారు పేర్కొన్నారు. అతిధులు చిత్రబృందానికి పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆచార్య వాయిదా మ‌రి ఖిలాడి వ‌స్తుందా!