Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హీరోగా మారనున్న అద్దంకి దయాకర్... ఆ సినిమాలో కాంగ్రెస్ నేతలంతా..?

Advertiesment
హీరోగా మారనున్న అద్దంకి దయాకర్... ఆ సినిమాలో కాంగ్రెస్ నేతలంతా..?
, శనివారం, 25 డిశెంబరు 2021 (13:26 IST)
addanki dayakar
తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతల్లో ఒకరైన అద్దంకి దయాకర్ హీరోగా మారనున్నారు. ఆయన పాన్ ఇండియా మూవీలో నటించారు. ఈ చిత్రానికి బొమ్మక్ మురళి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఇప్పటివరకు ప్రెస్ మీట్లు, టీవీ డిబేట్లలో కనిపించిన దయాకర్, సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇస్తుండటంతో అతడి అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
 
ఇక అద్దంకి దయాకర్‌కు భార్యగా సినీ నటి ఇంద్రజ నటిస్తున్నారు. ఈ సినిమాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది నేతలు నటించినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రజా యుద్ధనౌక గద్దర్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
 
కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్, ప్రముఖ నటుడు శుభలేఖ సుధాకర్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్టు తెలిసింది. అయితే ఈ సినిమాకు మేరా భారత్, జై భారత్ అనే పేర్లను పరిశీలిస్తున్నారని అద్దంకి తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రామారావు ఆన్ డ్యూటీ లో సాయం చేస్తున్న ర‌వితేజ‌