Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"ఏకమ్" చిత్రానికి అవార్డులు, రివార్డులు... అమెజాన్ ప్రైమ్ లో టాప్ 10లో

Advertiesment
ekam
విజ‌య‌వాడ‌ , మంగళవారం, 18 జనవరి 2022 (15:13 IST)
ఎస్.ఎమ్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై వరుణ్ వంశీని దర్శకుడుగా పరిచయం చేస్తూ ఎ.కళ్యాణ్ శాస్త్రి-పూజ.ఎమ్-శ్రీరామ్.కె సంయుక్తంగా నిర్మించిన విభిన్న కథాచిత్రం "ఏకమ్". దీనికి "ది జర్నీ ఆఫ్ ఏ జాబ్ లెస్ గాడ్" అన్నది ఉప శీర్షిక. అభిరామ్ వర్మ, శ్వేతావర్మ, తనికెళ్ళ భరణి, అదితి మ్యాకల్, కల్పిక గణేష్, దయానంద్ రెడ్డి ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 29 న విడుదలై ప్రేక్షకుల ఆదరణతోపాటు విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది.
 
 
రివార్డులతోపాటు అవార్డులు కూడా గెలుచుకుంటున్న ఈ చిత్రానికి తాజాగా అమెజాన్ ప్రైమ్ లో అసాధారణ స్పందన లభిస్తోంది. అమెజాన్ ప్రైమ్ లో 503 వ చిత్రంగా విడుదలైన "ఏకమ్" కేవలం పది రోజుల్లో టాప్-10లో స్థానం సంపాదించుకుని అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షిస్తోంది. పంచ భూతాల నేపథ్యంలో ఫిలసాఫికల్ డ్రామాగా, తాత్విక చింతనకు ఆధునికత జోడించి తెరకెక్కిన ఏకమ్ చిత్రానికి అమెజాన్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
 
 
ఈ సందర్భంగా చిత్రదర్శకుడు వరుణ్ వంశీ మాట్లాడుతూ, "ఏకమ్" చిత్రాన్ని ప్రేక్షకులంతా ఏకగ్రీవంగా ఆదరిస్తుండడం చాలా సంతోషాన్నిస్తోందని, నిర్మాతల పెట్టుబడిని సేఫ్ గా వెనక్కి తెస్తుండడంతోపాటు, దర్శకుడిగా నాకు రెండో సినిమా వచ్చేలా చేసిందన్నారు. ప్రస్తుతం అమెజాన్ లో టాప్ 10లో ఉన్న "ఏకమ్" అతి త్వరలో మొదటి రెండు మూడు స్థానాల్లో సగర్వంగా నిలుస్తుందనే నమ్మకం మాకుంది. అమెజాన్ ఆడియన్స్ తోపాటు "ఏకమ్" చిత్ర రూపకల్పనలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను" అన్నారు.
 
 
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఇక్బాల్ అజ్మీ, మ్యూజిక్: జొస్ ఫ్రాంక్లిన్, ఎడిటర్: శ్రీనివాస్ తోట, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హేమ ప్రకాష్, సమర్పణ: బోయపాటి రఘు, నిర్మాతలు: ఎ.కళ్యాణ్ శాస్త్రి--పూజ.ఎమ్., శ్రీరామ్.కె., కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వరుణ్ వంశీ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుప్రిత బాయ్‌ఫ్రెండ్‌ గురించి మీకు తెలుసా?