Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓటిటి అనేది న్యూ రెవల్యూషన్ - లూజర్ 2 ప్రి రిలీజ్ లో నాగార్జున‌

Advertiesment
ఓటిటి అనేది న్యూ రెవల్యూషన్ - లూజర్ 2 ప్రి రిలీజ్ లో నాగార్జున‌
, సోమవారం, 17 జనవరి 2022 (18:09 IST)
Looser team with nagarjuna
అన్నపూర్ణ ఫిలిం మీడియా కాలేజ్ లో  ట్రైన్ అయినవారు ఇండియా మొత్తం సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంటున్నందుకు చాలా గర్వంగా ఉంది .ఇప్పుడు యూత్ అంతా న్యూ ఐడియాస్, న్యూ థీమ్స్ ,కొత్త కథలతో ముందుకు వస్తున్నారు.మంచి కథలతో వచ్చే వారికి అన్నపూర్ణ స్టూడియో గేట్స్ ఎప్పుడు ఓపెన్ గా ఉంటాయి  మేము మేము అండగా ఉంటాము. అలాగే లూజర్ సీజన్ వన్ చాలా బాగుంది. సీజన్ టు గా వస్తున్న "లూజర్ 2" కూడా అంతకంటే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుతూ టీం అందరికీ అల్ ద బెస్ట్ అని అక్కినేని అమల  అన్నారు.
 
'లూజర్ 2'కు అభిలాష్ రెడ్డి, శ్రవణ్ మాదాల దర్శకత్వం వహించారు. దీనికి అభిలాష్ రెడ్డి క్రియేటర్. జీ5, అన్న‌పూర్ణ స్టూడియోస్‌, స్పెక్ట్ర‌మ్ మీడియా నెట్‌వ‌ర్క్క్‌ నిర్మించిన ఈ సిరీస్ జీ`5 ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని, దూసుకుపోతున్న సందర్భంగా ఈ ఆనందాన్ని పంచుకోవటానికి హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్ లో 'లూజర్ 2'  ప్రి రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి కింగ్ అక్కినేని నాగార్జున,అక్కినేని అమల,బ్యాట్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్, జీ 5 హెడ్స్ తదితరులు పాల్గొని ఏంతో ప్రేక్షాదరణ పొందిన ''లూజర్ 1" సక్సెస్ తర్వాత ఈ నెల 21 న జీ 5 లో "లూజర్ 2' గా ప్రేక్షకుల మన్ననలు పొందడానికి వస్తున్న టీం అందరికీ అల్ ధ బెస్ట్ తెలియజేశారు. 
 
 అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. ఓటిటి అనేది న్యూ రెవల్యూషన్. సినిమా అనేది ఆడియన్స్ ను రెండున్నర గంటలు ఒక థియేటర్లోనే కూర్చోబెట్టి  మెప్పిస్తూ ఎంటర్టైన్మెంట్ అయ్యేలా చెయ్యాలి.అయితే ఓటిటి వచ్చిన తరువాత ఎంటర్టైన్మెంట్ అనేది ఫోన్ లోకి వచ్చేస్తుంది. అయితే ఓటిటి లో సినిమా తీయాలంటే అంత ఈజీ కాదు సినిమా లా  ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలగాలి. అలాంటిది లూజర్ వెబ్ సిరీస్ ఆడియన్స్ ని థ్రిల్ కలిగించేలా అద్భుతంగా తీశారు. లూజర్ 2 ట్రైలర్ కూడా చూశాను. ట్రైలర్ లోనే ఇందులో ఉన్న కథ అందరికీ కనెక్ట్ అవుతుంది 
అక్కడే వీరు సక్సెస్ అయినట్టు. ఏ సినిమా అయినా వెబ్ సిరీస్ అయినా టీం ఇన్వాల్వ్ అయినప్పుడే సక్సెస్ అవుతుంది. ఈ లూజర్ సీజన్ కు పనిచేసిన టీం అందరికీ ఈ నెల 21 న వస్తున్న సీజన్ టీం అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుతూ టీం అందరికీ ఆల్ ద బెస్ట్.అలాగే 
చేతన్ ఆనంద్ గొప్ప ప్లేయర్, తనను చూసి భారతదేశం గర్వపడుతుంది. అన్నపూర్ణ గురించి చెప్పాలంటే మా నాన్న గారు అన్నిటికీ కాలేజస్, ఎడ్యుకేషన్స్ ఉన్నాయి కానీ సినీ పరిశ్రమకు ఎడ్యుకేషన్ లేదన్న నాన్న గారి ఆలోచన నుండి పుట్టినదే ACFM. అందుకే ఈ కాలేజ్ నుండి ఎంతో మంది నటులు,టెక్నిసిషన్స్ చదువుకొని మంచి పేరు తెచ్చుకుంటున్నారు.అలాగే అన్నపూర్ణ స్టూడియో లో మంచి టాలెంట్ ను ఎంకరేజ్ చేయడానికి మేము ఎప్పుడూ ముందు ఉంటాము. అలాగే జీ 5 స్టూడియో తో మా ట్రావెల్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. జీ 5 హోల్ టీం అనురాధ కు, నిమ్మకాయల ప్రసాద్, తదితరులందరికీ మా ధన్యవాదాలు. సుప్రియ కూడా చాలా కష్టపడి ఎంతో డెడికేటేడ్ గా వర్క్ చేస్తుంది.ఈ చిత్రానికి పని చేసిన టీం అందరికీ ఆల్ ద బెస్ట్.మరియు  లూజర్ 2 గా వస్తున్న ఈ సిరీస్ కు ప్రేక్షకులందరూ ఆదరించి ఈ టీం ను ఆశీర్వదించాలని అన్నారు. 
 
నిర్మాత సుప్రియ మాట్లాడుతూ..జీ 5 అసోసియేట్ లో "లూజర్"వెబ్ సిరీస్ చేసి  మళ్లీ ఇప్పుడు "లూజర్ 2" చేయడం చాలా సంతోషంగా ఉంది. జి5 ప్రసాద్ గారికి మొదట ఈ స్టోరీ చెప్పగానే మమ్మల్ని నమ్మి ఈ సిరీస్ ను చేయడానికి ముందుకు వచ్చారు వారికి మా ధన్యవాదాలు.అలాగే మా ప్రొడక్షన్ టీం అంతా చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా  స్పెక్ట్రమ్ మీడియా తో పాటు చంద్ర ,మహేష్, ఫుల్ సపోర్ట్ చేశారు వారందరికీ మా ధన్యవాదాలు అని అన్నారు 
 
దర్శకుడు అభిలాష్ మాట్లాడుతూ..మా లూజర్ సీజన్ టూ కొరకు వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.సీజన్ వన్ కోసం చాలామంది సెలబ్రెటీస్ మా "లూజర్" వెబ్ సిరీస్ సక్సెస్ కావాలని ట్వీట్ చేసి మాకు సపోర్ట్ చేశారు.ఈ కథకు భరత్, శ్రవణ్ లిద్దరూ రైటింగ్ లో ఫుల్ సపోర్ట్ చేశారు.అలాగే  మాకు సపోర్ట్ గా నిలుస్తూ 90% ఇన్పుట్స్ సుప్రియ గారు ఇచ్చారు వారికి మా ధన్యవాదాలు..నాతోపాటు కొన్ని ఎపిసోడ్స్ శ్రవణ్  డైరెక్ట్ చేయడం జరిగింది.  స్పెక్ట్రా మీడియా నెట్వర్క్ మాకు ఎం కావాలన్నా సహాయ సహకారాలు అందించారు వారికి మా ధన్యవాదాలు. నటీనటులు, టెక్నికల్ టీమ్ అంతా బాగా సపోర్ట్ చేయడంతో ఈ సిరీస్ బాగా వచ్చింది.ఈ నెల 21 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న "లూజర్ 2" ను కూడా  ప్రేక్షకులందరూ ఆదరించి గొప్ప విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు 
 
నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ.. మమ్మల్ని ఆశీర్వదించ డానికి వచ్చిన అక్కినేని నాగార్జున, అమల మేడమ్,బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్ లకు మా ధన్యవాదాలు.అన్నపూర్ణ బ్యానర్ లో ఎంతో మందికి అవకాశం ఇచ్చినా కూడా వారు గొప్పలు చెప్పుకోరు. మేము లూజర్ కోసం చాలా కష్టపడ్డాము.టెక్నిసిషన్స్ అందరూ చాలా సపోర్ట్ చేయడంతోనే ఈ సీరీస్ ఇంతపెద్ద హిట్ అయ్యింది.మా కిలాంటి మంచి కంటెంట్ ఉన్న సిరీస్ లో  నటించే అవకాశం ఇచ్చిన అన్నపూర్ణ స్టూడియో కు,సుప్రియ గారిగి జీ 5 కు మా ధన్యవాదాలు అన్నారు.
  
జీ5 మార్కెటింగ్‌ డైరెక్టర్ లాయిడ్ జేవియర్ మాట్లాడుతూ.. అన్నపూర్ణ స్టూడియోలో మేము ప్రివిలేజ్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది.ప్రతి ఒక్క ప్రేక్షకుడికి లూజర్ సీజన్ 1 కనెక్ట్ అయ్యింది.దీనికి సక్సెసర్ గా జనవరి 21 న వస్తున్న లూజర్ 2 ను ఆదరించాలని కోరుతూ మా జీ 5 యాప్ ను డౌన్ లోడ్ చేసి సబ్స్ క్రైబ్ చేసుకొని మా లూజర్ 2 ను పెద్ద సక్సెస్ చేయాలని కోరుతున్నాను.అలాగే మాకు సపోర్ట్‌ చేస్తున్న ఆడియెన్స్‌ అందరికీ థ్యాంక్స్‌.ఈ టీం అందరితో కలిసి జర్నీ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇటువంటి మంచి కంటెంట్‌ను ప్రేక్షకులకు రీచ్‌ అయ్యేలా కృషి చేసిన మా జీ5 టీం అందరికీ థ్యాంక్స్‌ చెపుతున్నా అన్నారు.
 
బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్ మాట్లాడుతూ ..15 సంవత్సరాల క్రితం  కామన్ వెల్త్ గేమ్స్ లో విన్ అయినపుడు జరిగిన పార్టీలో నాగార్జున గారిని కలవడం జరిగింది  తను చాలా నైస్ పర్సన్ "లూజర్ 2" టైలర్ చూశాను చాలా బాగుంది. ఇందులో పని చేసిన
నటీనటులు, టెక్నీషియన్లు అందరూ ఎంతో హార్డ్ వర్క్ చేశారు వారందరికీ "లూజర్ 1" హిట్ అయినట్లే "లూజర్
2" కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం అందరికీ ఆల్ ద బెస్ట్ అన్నారు . 
 
ఇంకా ఈ కార్యక్రమంలో శశాంక్ , రవి వర్మ , హర్షిత్, పావని, కల్పిక ,యానీ,తదితర నటీనటులంతా ఇందులో నటించే అవకాశం ఇచ్చిన జీ 5 యాజమాన్యానికి, అన్నపూర్ణ స్టూడియోకు, మరియు సుప్రియ మేడం కు ధన్యవాదాలు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవీన్ పోలిశెట్టి హీరోగా అనగనగా ఒక రాజు