Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్టూడియో గ్రీన్ బేన‌ర్‌లో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ చిత్రం

Advertiesment
స్టూడియో గ్రీన్ బేన‌ర్‌లో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ చిత్రం
, సోమవారం, 17 జనవరి 2022 (11:15 IST)
Gnanavel Raja, Kalyan Krishna
నాగార్జున, నాగ చైతన్య నటించిన `బంగార్రాజు`తో సంక్రాంతి బ్లాక్‌బస్టర్ అందించిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తన తదుపరి చిత్రం అగ్ర సంస్థ  స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్ లో చేయ‌నున్నారు. కెఇ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రానికి నిర్మాత‌.
 
ఈ బేన‌ర్‌లో కెఇ జ్ఞానవేల్ రాజా హీరో సూర్య‌తో `య‌ముడు, య‌ముడు 3` వంటి భారీ బ‌డ్జెట్ చిత్రాలు నిర్మించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న నిర్మించిన `నాపేరు శివ‌` వంటి ప‌లు చిత్రాలు తెలుగులో అనువాదం అయి విజ‌యాన్ని చ‌విచూశాయి.
 
ఈ సంద‌ర్భంగా కెఇ జ్ఞానవేల్ రాజా సోమ‌వారంనాడు ప్ర‌తికా ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంటూ, సంక్రాంతికి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో మా బేన‌ర్‌లో భారీ సినిమా చేయ‌నున్న విషయాన్ని సంతోషంగా ప్ర‌క‌టిస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేయ‌నున్నామ‌ని తెలిపారు.
 
కుటుంబ‌క‌థా చిత్రాలు తీస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రించే దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ ప్ర‌క‌ట‌న ప‌ట్ల ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల‌కు మ‌రిన్ని విష‌యాలు తెలియ‌జేస్తాన‌ని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సూపర్ స్టార్‌కు సోదరిగా సాయిపల్లవి?