Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క రూపాయి తీసుకోకుండా సినిమా చేసిన యువ హీరో.. భారీ హిట్.. ఎవరు?

Webdunia
మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (19:40 IST)
సాధారణంగా ఎవరైనా సరే సినిమాల్లో నటించాలంటే డబ్బులు తీసుకుంటుంటారు. యువ హీరోలైతే వారికి ఉన్న క్రేజ్‌ను బట్టి వారు డబ్బులను నిర్మాతల నుంచి తీసుకుంటారు. కానీ యువ హీరో నాని మాత్రం ఒక సినిమాకు డబ్బులు తీసుకోలేదు. కారణం తనపై డైరెక్టర్ పెట్టుకున్న నమ్మకం. ఒక మధ్య తరగతి క్రికెటర్ పడే కష్టం. అతను పడే బాధ. క్రికెట్ కోసం అతను పడే తపన. ఈ కథతో తెరకెక్కిన చిత్రం జెర్సీ.
 
ఈ సినిమా గురించి చెప్పనవసరం లేదు. క్రికెట్ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ కథను దర్సకుడు గౌతమ్ చెప్పినప్పుడు నానికి బాగా నచ్చిందట. ఈ సినిమాకు నేను డబ్బులు తీసుకోనని నిర్మాతకు చెప్పేశాడట నాని. ఈ సినిమా బాగా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. హిట్టయినప్పుడు నేను డబ్బులు తీసుకుంటా. లేకుంటే లేదు.
 
ఇలాంటి కథలు ఖచ్చితంగా రావాలన్నారట నాని. అనుకున్నట్లుగానే సినిమా భారీ విజయం సాధించి మంచి కలెక్షన్ల వైపు దూసుకెళుతోంది. కానీ నాని మాత్రం డబ్బులను మాత్రం నిర్మాత నుంచి తీసుకోలేదట. తాను ఒక నిర్మాతనేనని, ఒక మంచి కథ నచ్చినప్పుడు ఆ క్యారెక్టర్లో లీనమై నటిస్తే చాలని, అంతే తప్ప డబ్బు తీసుకోవాల్సిన అవసరం లేదని నాని చెప్పారట. విజయోత్సవ సభలో ఇదే విషయాన్ని నిర్మాత దిల్ రాజు చెప్పడంతో ఒక్కసారిగా కరతాళ ద్వనులతో సభాస్థలం మారుమ్రోగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments