సందేశమున్న చిత్రం కావడం వల్లే అవార్డులు : ఎన్టీఆర్

ఎన్టీఆర్‌: 'జనతా గ్యారేజ్‌' చిత్రం హీరో జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లోనే ఉత్తమ చిత్రంగా నిలవడమేగాక అవార్డుల వేటలో కూడా సత్తా చాటింది. 2016లో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే 7 నంది అవార్డులను ఖాతాలో వేసుకుంది.

Webdunia
గురువారం, 16 నవంబరు 2017 (08:45 IST)
ఎన్టీఆర్‌: 'జనతా గ్యారేజ్‌' చిత్రం హీరో జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లోనే ఉత్తమ చిత్రంగా నిలవడమేగాక అవార్డుల వేటలో కూడా సత్తా చాటింది. 2016లో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే 7 నంది అవార్డులను ఖాతాలో వేసుకుంది. గతంలో జరిగిన నేషనల్‌ ఫిలిం ఫేర్‌ అవార్డ్స్‌, సౌత్‌ ఇండియా ఫిలిం ఫేర్‌ అవార్డ్స్‌, సౌత్‌ ఇండియా ఫిలిం ఫేర్‌ అవార్డ్స్‌ వేడుకల్లో పలు విభాగాల్లో అవార్డులను ఈ చిత్రం కైవసం చేసుకుంది. 
 
నంది అవార్డుల జాబితాలో కూడా ఈ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్‌, మోహన్‌ లాల్‌‌లు అవార్డులు గెలుచుకోగా, ఉత్తమ గీత రచయితగా రామజోగయ్య శాస్త్రి, ఆర్ట్‌ డైరెక్షన్‌ విభాగంలో ఏ.ఎస్‌ ప్రకాష్‌, ఉత్తమ గీతంగా ప్రణామం ప్రణామం ఎంపికయ్యాయి. దీంతో మొత్తం ఏడు నందులు జనతా గ్యారేజ్‌కు దక్కాయి. ఈ సందర్భంగా ఎన్‌టిఆర్‌... మంచి సందేశమున్న చిత్రానికి అవార్డు రావడం ఆనందంగా వుందని పేర్కొన్నారు. ముఖ్యంగా మలయాళ నటుడు మోహన్ లాల్ తొలిసారి తెలుగులో నంది అవార్డును ఈ చిత్రం ద్వారా అందుకోనున్నారు. 
 
అలాగే, 2014 సంవత్సరంలో 'లెజెండ్‌'లో ఉత్తమ నటుడిగా బాలకష్ణ  ఎంపికయ్యారు. 2016కు నాన్నకు ప్రేమతో ఎన్టీఆర్‌కు లభించింది. ఈ సందర్భంగా కళ్యాణ్‌ రామ్‌ స్పందిస్తూ.... బాబాయ్‌, తమ్ముడికి అభినందనలు తెలిపాడు. నందమూరి కుటుంబానికి ఇదొక గర్వించదగ్గ తరుణం'' అంటూ ట్వీట్‌ చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిలో రూ.260 కోట్లతో శ్రీవారి ఆలయం.. శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు

సర్పంచ్ కుర్చీ కోసం ఆగమేఘాలపై వివాహం - తీరా చూస్తే ఆశలు గల్లంతయ్యాయి..

పదేపదే వేడినీళ్లు అడుగుతున్నాడు.. అతనో పిచ్చోడు.. వరుడిపై వధువు మండిపాటు

ChatGPT: 16 ఏళ్ల బాలుడి ఆత్మహత్యకు బాధ్యత వహించని ఓపెన్ఏఐ

Nara Lokesh: విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి.. సామాజిక మార్పుకు సహకరించాలి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments