Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉత్తమ నటులు బాలయ్య - మహేష్ - ఎన్టీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించింది. ఒకేసారి మూడు సంవత్సరాలకుగాను ఈ నంది పురస్కారాలు ప్రకటించింది. 2014, 2015, 2016 సంవత్సరాలకుగాను నంది పురస్కారాలతోపాటు ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు, బీఎన్

Advertiesment
ఉత్తమ నటులు బాలయ్య - మహేష్ - ఎన్టీఆర్
, బుధవారం, 15 నవంబరు 2017 (08:51 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించింది. ఒకేసారి మూడు సంవత్సరాలకుగాను ఈ నంది పురస్కారాలు ప్రకటించింది. 2014, 2015, 2016 సంవత్సరాలకుగాను నంది పురస్కారాలతోపాటు ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు, బీఎన్‌ రెడ్డి, నాగిరెడ్డి-చక్రపాణి, రఘుపతి వెంకయ్య అవార్డులను ప్రకటించారు. 
 
ఇందులోభాగంగా, ఉత్తమ నటులుగా బాలకృష్ణ (2014-లెజెండ్‌), మహేష్‌బాబు (2015-శ్రీమంతుడు), ఎన్టీఆర్‌ (2016-జనతా గ్యారేజ్‌, నాన్నకు ప్రేమతో) నంది పురస్కారానికి ఎంపికయ్యారు. ఉత్తమ నటీమణులుగా అంజలి (2014-గీతాంజలి), అనుష్క (2015-సైజ్‌ జీరో), రీతూ వర్మ (2016-పెళ్లి చూపులు) నిలిచారు. అలాగే, ఉత్తమ చిత్రాలుగా లెజెండ్‌ (2014), బాహుబలి :ది బిగినింగ్‌(2015), పెళ్లి చూపులు (2016)లు ఎంపికయ్యాయి. 
 
మంగళవారం సాయంత్రం పురస్కారాల ఎంపిక కమిటీలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని సచివాలయంలో కలసి విజేతల జాబితాలను అందించాయి. అనంతరం హిందూపురం ఎమ్మెల్యే, కథానాయకుడు నందమూరి బాలకృష్ణ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర విభజన, తదనంతర పరిస్థితుల్లో గత అయిదేళ్లుగా నంది పురస్కారాల కార్యక్రమం చేపట్టలేదని తెలిపారు. 2012 నుంచి 2016 వరకూ వచ్చిన చిత్రాలకు సంబంధించిన నందుల ప్రదానాన్ని ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారన్నారు. 
 
ఇకపోతే, ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారాలను 2014కి ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌, 2015కి శతాధిక చిత్ర దర్శకుడు కె.రాఘవేంద్రరావు, 2016కి ప్రముఖ నటుడు రజనీకాంత్‌లను కమిటీ ఎంపిక చేసినట్లు ప్రకటించారు. బీఎన్‌ రెడ్డి పురస్కారం-2014కి ఎస్‌.ఎస్‌.రాజమౌళి, 2015కి త్రివిక్రమ్‌, 2016కి బోయపాటి శ్రీను ఎంపికయ్యారు. 
 
నాగిరెడ్డి-చక్రపాణి పురస్కారం-2014 ఆర్‌.నారాయణమూర్తి, 2015కి కీరవాణి, 2016కి కె.ఎస్‌.రామారావులకు ప్రదానం చేస్తారు. రఘుపతి వెంకయ్య అవార్డు-2014కి కృష్ణంరాజు, 2015కి ఈశ్వర్‌ (పబ్లిసిటీ డిజైనర్‌), 2016కి చిరంజీవికి అందజేస్తారు. నంది పురస్కార విజేతల్ని గిరిబాబు, జీవిత, పోకూరి బాబూరావుల నేతృత్వంలోని జ్యూరీలు ఎంపిక చేశాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏ గాడిద కొడుకును వదిలిపెట్ట... లక్ష్మీపార్వతి శపథం