మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో మరో అవార్డు. నంది అవార్డుల్లో 2016 ఏడాదికిగాను ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు చిరంజీవికి ప్రకటించారు. ఈ సందర్భంగా చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు.
మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో మరో అవార్డు. నంది అవార్డుల్లో 2016 ఏడాదికిగాను ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు చిరంజీవికి ప్రకటించారు. ఈ సందర్భంగా చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. 'రఘుపతి వెంకయ్య అవార్డుకు కమిటీ నన్ను ఎంపిక చేయడం చాలా ఆనందంగా ఉంది. ఓ గొప్ప వ్యక్తి పేరిట నెలకొల్పిన అవార్డు 2016 ఏడాదికిగాను నన్ను ఎంపిక చేసినందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి, జ్యూరీకి కృతజ్ఞతలు. అలాగే మిగతా విజేతలకు నా అభినందనలు అని వ్యాఖ్యానించారు.
తన అభిమాన దర్శకుడి పేరు మీదున్న అవార్డు రావడంతో త్రివిక్రమ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. బీఎన్ రెడ్డి పురస్కారం 2015 సంవత్సరానికిగాను ఆయనకు దక్కింది. ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ 25వ చిత్ర షూటింగ్ కోసం యూరప్ వెళ్లారు. త్వరలోనే పూర్తికానున్న ఆ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ చేయనున్నారు. పవన్‌తో త్రివిక్రమ్ చేస్తున్న ఈ మూడవ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో, సినీ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి.