'మున్నాభాయ్‌' ఇంట్లో మలయాళ సూపర్ స్టార్...

Webdunia
ఆదివారం, 15 నవంబరు 2020 (12:54 IST)
ఊపరితిత్తుల కేన్సర్ బారినపడిన బాలీవుడ్ మున్నభాయ్ సంజయ్ దంత్ ప్రస్తుతం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. తన పిల్లలైన షహ్రాన్, ఇక్రాల పుట్టినరోజు నాడు కేన్స‌ర్‌ని జ‌యించాన‌ని పొడ‌వైన పోస్ట్ పెట్టి అభిమానుల‌ని ఆనందింప‌జేశాడు. తమ అభిమాన నటుడు కేన్సర్‌ను జయించి తిరిగి మామూలు మనిషిగా మారడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేసారు. 
 
ఇదిలావుంటే, దీపావళి పండుగను కూడా ఆయన తన భార్య మాన్యతా దత్‌తోకలిసి ముంబైలోని తన నివాసంలో జరుపుకున్నారు. సంజ‌య్ ఇంట్లో జ‌రిగిన దీవాళి వేడుక‌ల‌లో మ‌ల‌యాళ మెగాస్టార్ మోహ‌న్ లాల్ కూడా పాలుపంచుకున్నారు.
 
సంప్ర‌దాయ‌మైన దుస్తుల‌లో మెరిసిన వీరిని చూసి అభిమానులు తెగ సంతోషించారు. వేడుకలకు సంబంధించిన ఫోటోలను మోహన్‌లాల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేస్తూ.. 'సంజయ్‌, మాన్యతా నా స్నేహితులు' అని కాప్షన్‌ జతచేశారు. 
 
ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. సినిమాల విష‌యానికి వ‌స్తే సంజయ్‌ దత్ ప్ర‌స్తుతం కన్నడ "కేజీఎఫ్-2"లో న‌టిస్తున్నాడు. ఇక మోహ‌న్ లాల్ "దృశ్యం 2" చిత్ర షూటింగ్ పూర్తి చేశాడు. ఈయన త్వరలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీల్లో భాగస్వామికానున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments