బాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి మరో చేదు వార్త వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్ ఖల్‌నాయక్, సినీ హీరో సంజయ్ దత్ లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు సమాచారం. ఇది నాలుగో దశలో ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు ఆయనకు జరిపిన పరీక్షల్లో నిర్ధారణ అయినట్టు మీడియా కథనాల సమాచారం.
ఇటీవల శ్వాస వ్యాధితో బాధపడుతూ.. ముంబై లీలావతి హాస్పటల్‌లో చికిత్స తీసుకుని తీసుకుని వచ్చిన సంజయ్ దత్‌కు లంగ్ క్యాన్సర్ అంటూ బాలీవుడ్ మీడియా ప్రచారం చేస్తుంది. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయమే. ఒక మనిషికి ఇన్ని పరీక్షలు ఉంటాయా అని అనిపిస్తుంది సంజయ్ దత్‌ను చూస్తుంటే.
ఎన్నో కష్టాలను అధిగమించి ప్రశాంతమైన జీవితం సాగిస్తున్న సంజయ్ దత్‌కు మళ్లీ లంగ్ క్యాన్సర్ సమస్య అంటే.. వినడానికే చాలా బాధగా అనిపిస్తుంది. ప్రస్తుతం సంజయ్ దత్ అమెరికాలో ఈ క్యాన్సర్‌కు ట్రీట్‌మెంట్ తీసుకునేందుకు వెళ్లబోతున్నట్లుగా ముంబై మీడియా ప్రకటించింది. ఆయన ఈ క్యాన్సర్ బారి నుంచి త్వరగా కోలుకుని.. మళ్లీ సినిమాలతో అందరినీ అలరించాలని ఆశిద్దాం.