దిల్‌రాజుతో మైండ్ బ్లోయింగ్ సినిమా - విజ‌య్‌; కేరింత కు ఫొటోషూట్ చేశాంః దిల్‌రాజు

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (14:09 IST)
Dil Raju- Vijay
చిన్న పాత్ర‌లు వేయ‌డం నుంచి క‌థానాయ‌కుడిగా ఎదిగిన విజ‌య్ దేవ‌ర‌కొండ అతి త‌క్కువ కాలంలో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. పూరీ జ‌గ‌న్నాథ్ ఆయ‌న‌తో తీస్తున్న లైగ‌ర్ సినిమా చేయ‌డం కూడా అదే కార‌ణం. అయితే దిల్‌రాజుకూ, విజ‌య్ దేవ‌ర‌కొండకూ మంచి సాన్నిహిత్యం వుంది. ఇద్ద‌రూ తెలంగాణ ప్రాంత వాసులే. అందుకే వీరి కాంబినేష‌న్‌లో ఎవ్వ‌రూ ఊహంచ‌ని విదంగా సినిమా వుండాల‌ని క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. దీని గురించి విజ‌య్ మాట్లాడారు.
 
- ఎక్క‌డో నిజామాబాద్ నుంచి ఇక్క‌డ‌కు వ‌చ్చి దిల్‌రాజు సినీ ఇండ‌స్ట్రీలో స్థిర‌ప‌డ్డారు. థియేట‌ర్స్‌, క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ రంగాల‌ను చూసుకుంటూ  నిరంత‌రం ఫైట‌ర్స్‌లా ప‌నిచేశారు. ఇప్పుడు ఇండియా రేంజ్లో సినిమాలు చేస్తున్నారు. నాకెంతో ఇన్‌స్పిరేష‌న్ ఇచ్చిన వ్య‌క్తులు వాళ్లు. రాజుగారితో మైండ్ బ్లోయింగ్ సినిమా చేయాల‌ని వెయిట్ చేస్తున్నాను. త్వ‌ర‌లోనే అనౌన్స్ చేస్తాం` అని విజ‌య్ దేవ‌ర‌కొండ వెల్ల‌డించాడు.

కేరింత సెల‌క్ష‌న్‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌చ్చాడు
ఇందుకు దిల్ రాజు స్పందిస్తూ, విజ‌య్‌తో నాకు డిఫ‌రెంట్ జ‌ర్నీ ఉంది. `కేరింత` సినిమాకు ముగ్గురు హీరోల్లో ఒక‌రిగా న‌టించ‌డానికి విజ‌య్ దేవ‌ర‌కొండ ఫొటో షూట్‌కు వ‌స్తే, అలా చూసేసి వెళ్లిపోయాను. త‌న‌ను క‌ల‌వ‌లేదు. అలాగే పెళ్లిచూపులు సినిమాను కూడా నాకు చూపించాల‌ని త‌ను ప్ర‌య‌త్నిస్తే నేను ఆస్ట్రేలియాలో హాలీడేస్‌లో ఉన్నాను. తర్వాత త‌ను అర్జున్ రెడ్డితో ఓ క‌ల్ట్ స‌క్సెస్ సాధించాడు. గీతా గోవిందం స‌క్సెస్ త‌ర్వాత ఈవెంట్‌కు వెళ్లిన నేను అక్క‌డకు విజ‌య్ వ‌స్తుంటే వ‌స్తున్న రెస్పాన్స్ చూసి.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గారికి ఫ్యాన్స్ దొరికారు. త‌ర్వాత మూడు నాలుగు సినిమాల్లో ఆ రేంజ్‌లో యూత్‌ను సాధించాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లా తెలుగు ఇండ‌స్ట్రీకి ఓ యూత్‌ఫుల్ స్టార్ దొరికాడ‌ని చెప్పాను. లైగ‌ర్‌తో ఇప్పుడు త‌ను పాన్ ఇండియా హీరోగా ఇంట్ర‌డ్యూస్ అవుతున్నాడు. త‌న‌కు ఈ సంద‌ర్భంగా ఆల్ ది బెస్ట్‌. త్వ‌ర‌లో మేం క‌లుస్తాం అంటూ వివ‌రించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బలమైన మిత్రుడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధాని మోడి, కీలక ఒప్పందాలు

అసలే చలి.. నాలుగు రోజుల్లో 5.89 లక్షల బీరు కేసులు కుమ్మేసిన మందుబాబులు

జనం మధ్యకి తోడేలుకుక్కలు వచ్చేసాయా? యూసఫ్‌గూడలో బాలుడిపై వీధి కుక్క దాడి

టీడీపీలో మిస్ ఫైర్లు, క్రాస్ ఫైర్లు, విడాకులు జరగవు.. నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా అభివృద్ధి చేస్తాం.. సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments