Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇండస్ట్రీకి మరో పవన్ కల్యాణ్ దొరికాడు.. చెప్పిందెవరు?

Advertiesment
ఇండస్ట్రీకి మరో పవన్ కల్యాణ్ దొరికాడు.. చెప్పిందెవరు?
, గురువారం, 21 అక్టోబరు 2021 (10:40 IST)
టాలీవుడ్ హీరోకి కొత్త నిర్వచనం చెప్పినా నటుడు విజయ్ దేవర కొండ. ఇండస్ట్రీలోకి వచ్చిన అనతికాలంలోనే స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా సినిమా సినిమాకి ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా తన ఇమేజ్‌ను పెంచుకుంటూపోతున్నాడు. 
 
ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు బిజినెస్‌లతో కూడా బిజీ అయిపోయాడు. వీలున్నపుడల్లా.. యాడ్స్ చేస్తూ అదరకొడుతున్నాడు. టాలీవుడ్‌లో సక్సెస్ హీరోగా దూసుకపోతున్నాడు. తాజా ఈ హీరోపై ప్రముఖ ప్రోడ్యూసర్ దిల్ రాజు క్రేజీ కామెంట్స్ చేశారు.
 
దిల్ రాజు ఇంటి నటుడు ఆశీష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రౌడీ బాయ్స్. ఈ సినిమా నుంచి పాటను రిలీజ్ చేయడానికి ఓ స్పెషల్ ఈవెంట్ చేశారు. దీనికి విజయ్ దేవరకొండను చీఫ్ గెస్ట్‌గా తీసుకొచ్చాడు. విజయ్‌తో ఉన్న రిలేషన్, జర్నీ గురించి దిల్ రాజు చెప్పుకొచ్చాడు.
 
అర్జున్ రెడ్డి లాంటి మాస్ మూవీనైనా.. గీత గోవిందం లాంటి క్లాస్ మూవీనైనా చేసే సత్తా విజయ్‌కే ఉంది. గీతా గోవింద సక్సెస్ తరువాత ఈవెంట్‌కు వెళ్లాను. అక్కడ విజయ్ వస్తుంటే.. అభిమానులు రౌడీ రౌడీ అంటుంటే.. ఆ స్టేజ్ అంతా మారుమోగింది. 
 
అప్పుడు విజయ్‌కి నేను ఒక్కటే చెప్పాను. అతి తక్కువ సమయంలోనే ఇంత స్టార్డం వచ్చింది. అలా పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. కేవలం నాలుగు సినిమాలకే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ డాం వచ్చిందని చెప్పారు. తెలుగు ఇండస్ట్రీకి యూత్ ఫుల్ స్టార్, పవన్ కళ్యాణ్‌లాగా మళ్లీ దొరికాడు.
 
మా జర్నీ విచిత్రమైంది. విజయ్ కేరింత సినిమాకు హీరోగా ఆడిషన్ ఇచ్చాడు. అప్పుడు సరిగ్గా చూడలేదు. అలా చూసి వెళ్లిపోయాను. ఇప్పుడు.. నాలుగు సినిమాలతోనే స్టార్‌గా ఎదగడం, లైగర్‌తో పాన్ ఇండియన్ హీరోగా మారుతున్నావ్ ఆల్ ది బెస్ట్. అడగ్గానే మా ఈవెంట్‌కు వచ్చినందుకు థ్యాంక్స్' అని అన్నారు దిల్ రాజ్. ఇప్పుడూ దిల్ రాజ్ మాటలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెద్ద పండుగకు వస్తానంటున్న 'బంగార్రాజు'