Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప‌వ‌న్‌తో చాలా విష‌యాలు చ‌ర్చించాం- మేమంతా కుటుంబ స్నేహితులంః మంచు విష్ణు

Advertiesment
ప‌వ‌న్‌తో చాలా విష‌యాలు చ‌ర్చించాం- మేమంతా కుటుంబ స్నేహితులంః  మంచు విష్ణు
, మంగళవారం, 19 అక్టోబరు 2021 (12:18 IST)
Vishnu-Pawan
ద‌స‌రా సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో బండారు ద‌త్తాత్రేయ‌, టిఆర్‌.ఎస్‌. ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన అల‌య్ బ‌ల‌య్ కార్య‌క్ర‌మంలో మంచు విష్ణు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాల్గొన్నారు. స్టేజీపై ప‌క్క ప‌క్క‌నే కూర్చున్నారు. కానీ ఒక్క మాట కూడా మాట్లాడుకోలేద‌నీ సోష‌ల్‌మీడియా తెగ ప్ర‌చారం చేసింది. దీనిపై ఎవ‌రితోచిన‌విధంగా వారు స్పందించారు. అటు మెగా అభిమానుల‌కు, ఇటు మంచు అభిమానుల‌కు ఆశ్చ‌ర్యం క‌లిగించిన విష‌యమే.
 
కానీ అదేరోజు మెగాస్టార్ చిరంజీవి మంచు మోహ‌న్‌బాబుకి ఫోన్ చేయ‌డం, అభినందించ‌డం, క‌లిసి ప‌నిచేయాల‌నుకోవ‌డం, నేను ఎవరికీ స‌పోర్ట్ చేయ‌లేద‌నీ అన‌డం జ‌రిగిపోయాయి. అయితే ఇదంతా గ‌మ‌నించిన మంచు విష్ణు అల‌య్ బ‌ల‌య్ కార్య‌క్ర‌మంలో ఏం జ‌రిగింద‌నేది మంగ‌ళ‌వారంనాడు చెప్పుకొచ్చారు.  
 
మీడియా రాసిందానికి జ‌రిగిన‌దానికి సంబంధమేలేదు.  ప్రోటోకాల్ కారణంగా పవన్ కళ్యాణ్ తో వేదిక పై మాట్లాడలేదు. వేదిక‌పై కాకుండా వేదిక‌కు వ‌చ్చేముందు `మా` గురించి కుటుంబ విష‌యాల గురించి చాలా చ‌ర్చించుకున్నాం. మెగా ఫ్యామిలీ మంచు కుటుంబం, మేమంతా కుటుంబ స్నేహితులం. ఎన్నిక‌ల్లో చూసేవారికి విరోధులుగా మీడియా ట్రీట్ చేసింది. అస‌లేం జ‌రిగిందే తెలుసుకోవాలి గ‌దా. అంటూ ప‌వ‌న్‌, మంచుని ఆప్యాయంగా కౌగిలించుకుని శుభాకాంక్ష‌లు చెబుతున్న క్లిప్‌ల‌ను విడుద‌ల చేశారు. ఆ ప‌క్క‌నే సీనియ‌ర్ నిర్మాత‌, న‌టుడు త్రిపుర‌నేని చిట్టిబాబు, బిజెపి నాయ‌కుడు కూడా సాక్షిగా నిలిచారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాలో ఉన్నవారంతా జోకర్సే.. ఆర్జీవీ ట్వీట్