Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మెర్శల్' ఎఫెక్ట్ : పన్ను ఎగ్గొట్టిన హీరో విశాల్... ఐటీ తాఖీదులు

తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు, హీరో విశాల్‌కు కష్టాలు ఆరంభమయ్యాయి. హీరో విజయ్ నటించిన "మెర్శల్" చిత్రంలో జీఎస్టీతో పాటు 'డిజిటల్ ఇండియా'ను విమర్శించే సన్నివేశాలు, డైలాగులు ఉన్నాయి.

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2017 (15:41 IST)
తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు, హీరో విశాల్‌కు కష్టాలు ఆరంభమయ్యాయి. హీరో విజయ్ నటించిన "మెర్శల్" చిత్రంలో జీఎస్టీతో పాటు 'డిజిటల్ ఇండియా'ను విమర్శించే సన్నివేశాలు, డైలాగులు ఉన్నాయి. వీటిపై తమిళనాడుకు చెందిన బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ, ఆ సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. 
 
కానీ, తమిళ చిత్రపరిశ్రమ మొత్తం ఏకమై... బీజేపీ నేతల తీరును ఎండగడుతున్నారు. ఈ నేపథ్యంలో హీరో విజయ్‌కు విశాల్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అలాగే, ఈ సినిమాని ఇంటర్నెట్‌లో చూసిన బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్‌.రాజాను తప్పుపట్టారు. దీంతో విశాల్‌కు చెందిన కార్యాలయంలో ఇటీవల జీఎస్టీ నిఘా విభాగం అధికారులు దాడులు చేశారు. ఈ సోదాల్లో రూ.51 లక్షల పన్ను చెల్లించలేదని తెలుసుకున్నారు. 
 
దీంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు విశాల్‌కి సమన్లు జారీచేశారు. ఈ నెల 27వ తేదీన తమ కార్యాలయంలో హాజరుకావాలని సూచించారు. విశాల్‌ కార్యాలయం నుంచి కొన్ని కీలక ఆధారాలను ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న‌ట్లు స‌మాచారం. బీజేపీ నేతలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకే విశాల్ కార్యాలయంలో దాడులు జరిపారని విమర్శలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

నా కోడలికి వివాహేతరం సంబంధం, భరించలేకే నా కొడుకు సూసైడ్: తల్లి ఆరోపణ

పాకిస్థాన్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ.. ఎవరు స్థాపించారంటే...

బస్సులో డెలివరీ.. బిడ్డను కిటికీలో నుంచి విసిరేసిన తల్లి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments