Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జల్లికట్టు అంటే జంతువులను హింసించడం కాదు.. సంప్రదాయ క్రీడ: విశాల్

జల్లికట్టు నిర్వహణకు అనుమతి ఇవ్వాలని తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరారు. జల్లికట్టు కోసం అర్డినెన్స్ జారీ చెయ్యాలని పన్నీర్ సెల్వం మనవి చేశారు. ఈ నేపథ్యంలో జల్లి

జల్లికట్టు అంటే జంతువులను హింసించడం కాదు.. సంప్రదాయ క్రీడ: విశాల్
, గురువారం, 19 జనవరి 2017 (16:39 IST)
జల్లికట్టు నిర్వహణకు అనుమతి ఇవ్వాలని తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరారు. జల్లికట్టు కోసం అర్డినెన్స్ జారీ చెయ్యాలని పన్నీర్ సెల్వం మనవి చేశారు. ఈ నేపథ్యంలో జల్లికట్టుపై నటుడు విశాల్ స్పందించాడు. తమిళనాడులో జరుగుతున్నది నిరసన కాదని, ఇదొక ఉద్యమం అని విశాల్ తెలిపాడు. 
 
గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జంతువులను హింసిస్తారన్న కోణంలో చూడకూడదన్నాడు. తమిళనాడులో ప్రతి సంక్రాంతికి జరుపుకోవడం సంప్రదాయమని చెప్పాడు. జల్లికట్టు రైతుల జీవన విధానంతో ముడిపడిన క్రీడ అని విశాల్ అభిప్రాయపడ్డారు. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాల్సిన అవసరం ఉందని, ఇది సంప్రదాయ బద్దంగా వస్తున్నటువంటి క్రీడా అని, దానికి అందరూ మద్దతు ఇవ్వాలని, చట్టపరిధిలోనే జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని విశాల్ కోరారు.
 
తమిళప్రజల సంప్రదాయాన్ని నిషేధించడం సరికాదని విశాల్ తెలిపాడు. జల్లికట్టులో పాల్గొనే పశువులు కూడా నశించిపోతున్నాయని, జల్లికట్టు ద్వారా పశువుల ప్రాధాన్యతను కూడా చాటిచెప్పవచ్చునని విశాల్ అన్నారు. కాగా జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని గత మూడు రోజులుగా చెన్నై మెరీనా బీచ్‌లో విద్యార్థులు, యువత బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారని విశాల్ గుర్తు చేశాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐష్‌కి తర్వాత ఎమీజాక్సనే.. రోబో 2 కోసం ఎమీ చాలా కష్టపడుతుందట.. టూ పీస్‌లో..