ఓపీఎస్ - ఈపీఎస్... ఇద్దరిలో ఎవరైతే మాకేంటి.. మాకు ఒరిగేది ఏమీ లేదు: హీరో విశాల్
నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, సినీ నటుడు విశాల్ తమిళనాడు ముఖ్యమంత్రి ఈ.పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వంలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరు ఎవరు ముఖ్యమంత్రి అయినా మాకు ఒరిగేది ఏంటన
నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, సినీ నటుడు విశాల్ తమిళనాడు ముఖ్యమంత్రి ఈ.పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వంలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరు ఎవరు ముఖ్యమంత్రి అయినా మాకు ఒరిగేది ఏంటని ఆయన ప్రశ్నించారు.
తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి పళనిస్వామి తన బలాన్ని నిరూపించుకునే సమయంలో జరిగిన అవాంఛనీయ ఘటనలపై విశాల్ తాజాగా స్పందించారు. సభలో జరిగిన ఘటన చాలా దురదృష్టకరమన్నారు. ప్రజాప్రతినిధులు కనీసం చట్టసభల్లో సభ్యుల్లోనైనా హుందాగా మెలగాలని హితవు పలికారు.
అదేసమయంలో ఈపీఎస్ (పళనిస్వామి) గెలిచినా, ఓపీఎస్ (పన్నీర్ సెల్వం) గెలిచినా తమకు ఒరిగేది ఏమీ లేదన్నారు. రాష్ట్రంలోని రైతులంతా కరవు కోరల్లో చిక్కుకున్నారని, అయినా రైతాంగాన్ని కాపాడే నాథుడే లేడని మండిపడ్డారు. ప్రస్తుత పాలకులైనా తమకు ఓటేసిన ప్రజల కష్టసుఖాలను పట్టించుకుంటారని ఆశపడుతున్నట్టు చెప్పారు.