Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రిని స్మ‌రించుకున్న మెగాస్టార్‌

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (17:04 IST)
Nagababu- chiru
మెగాస్టార్ చిరంజీవి త‌న తండ్రి వెంక‌ట్రావ్ గారిని ఏడాది కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా స్మ‌రించుకున్నారు. నాగ‌బాబు కూడా ఆయ‌న‌తో వున్నారు. త‌మ స్వ‌గృహంలోనే ఫొటోకు న‌మ‌స్క‌రిస్తూ, ఆయ‌న‌కు ఇష్ట‌మైన‌వి ముందుంచి శుక్ర‌వారంనాడు శ్ర‌ద్దాంజ‌లి ఘటించారు.

 
నాన్న గారి సంవత్సరీకం సందర్భంగా ఆయన స్మృతులని తలుచుకుంటూ, మాకు జన్మనిచ్చిన ఆ మహనీయుడు ఏ లోకంలో వున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము అంటూ ట్వీట్ చేశారు.

 
సమాజం కోసం తపించే ముగ్గురు మొనగాళ్లను ఇచ్చిన మహానుభావుడు "వెంకటరావు" గారి ఆత్మకు తప్పకుండా సద్గతి కలిగి ఉంటుందని ట్విట్ట‌ర్‌లో కొంద‌రు స్పందించారు. ఇదిలా వుండ‌గా, గురువారం జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఒక స్పెషల్ వీడియోను పోస్ట్ చేసారు. చిరు తన పెరట్లో కొన్ని నెలల క్రితం పొట్లకాయ విత్తనాలను నాటగా, అది పెరిగి, ఇప్పుడు పొట్లకాయలు కూడా అయ్యాయట.


పెరట్లో ఆనపకాయ కాస్తేనే నాకు ఇంత సంతోషమనిపిస్తే, మట్టి నుంచి పంట పండించి, మనందరికీ అన్నం పెట్టే రైతు ఇంకెంత సంతోషంగా ఉండాలి. అలా ఉండేలా మనమే చూసుకోవాలి. వ్యవసాయం చేస్తూ మనందరికీ సాయం చేస్తున్న ప్రతి ఒక్క రైతుకి నా సెల్యూట్” అంటూ  రైతులకు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments