Upasana Konidela with transgender
రామ్ చరణ్ భార్య, మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన అద్భుతమైన స్టేట్‌మెంట్ ఇచ్చింది. తన సోషల్ మీడియాలో ట్రాన్స్‌జెండర్లతో కూడిన ఫొటోలు పోస్ట్ చేసింది. వారంటే తనకు ఎంతో గౌరవమని పేర్కొంది. గత కొంతకాలంగా ఆమె పలు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది కూడా. ట్రాన్స్‌జెండర్లంటే గౌరవం అని పలుసార్లు పేర్కొంది.
Konidela with transgenders
గురువారంనాడు పెట్టిన పోస్ట్ సారాంశం బట్టి, వాళ్ళలో ఒకరి పెండ్లి వేడుక సందర్భంగా వారిని ఆశీర్వించినట్లు తెలుస్తోంది. ఇందులో లక్ష్మీ నారాయణ (తిరుపతమ్మ) అనే ఓ వ్యక్తి మాట్లాడుతూ, చాలా ఆప్యాయతతో పెళ్లి వేడుకలను ప్రారంభించినందుకు ధన్యవాదాలు. జీవితాన్ని సంపూర్ణంగా జీవించమని మీరు ఎల్లప్పుడూ నాకు బోధిస్తారని ఉపాసకు కృతజ్ఞతలు తెలిపారు.
ఉపాసన తెలుపుతూ, నేను హైదరాబాద్‌లోని లింగమార్పిడి జాతి సమాజాన్ని నిజంగా గౌరవిస్తాను. భారతదేశంలోని పురాతనమైన జాతిలో వీరు ఒకరుగా చెప్పబడింది. హైదరాబాద్‌లోని పెద్ద పెద్ద గృహాల ప్రతినిధులకు మీరు ఆతిథ్యం ఇస్తుంటారు. వీరు జీవితంలో ఎంతో కష్టపడుతుంటారు. వీరి జీవితం గురించి చెప్పడానికి గొప్ప కథలు ఉన్నాయి. సంఘంతో మరింత సన్నిహితంగా ఇలా సంభాషించగలిగినందుకు నేను సంతోషంగా ఉన్నాను. వారి గురించి ప్రపంచానికి తెలియజేయాలనుంది. వారికోసం ఏదైనా చేయాలనుకుంటున్నానని ఉపసాన తెలిపారు.