Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ మంచి స్నేహితులు - వెంక‌టేష్‌తోనూ సినిమా చేస్తున్నా - స‌ల్మాన్ ఖాన్‌

చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ మంచి స్నేహితులు - వెంక‌టేష్‌తోనూ సినిమా చేస్తున్నా - స‌ల్మాన్ ఖాన్‌
, గురువారం, 2 డిశెంబరు 2021 (16:14 IST)
Salman Khan, Aayush Sharma, Mahesh Manjrekar
బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్ ఖాన్ హీరోగా న‌టిస్తూ స‌ల్మాన్ ఖాన్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై నిర్మించిన చిత్రం ‘అంతిమ్‌’. మ‌హేశ్ మంజ్రేక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. న‌వంబ‌ర్ 26న సినిమా విడద‌లై సూప‌ర్ హిట్ టాక్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతుంది. బుధ‌వారం రాత్రి ఈ సినిమా థాంక్స్ మీట్ హైద‌రాబాద్‌లోని ఇన్ ఆర్‌బిట్ మాల్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో స‌ల్మాన్ ఖాన్‌, ఆయుష్ శ‌ర్మ‌, డైరెక్ట‌ర్ మ‌హేశ్ మంజ్రేక‌ర్ పాల్గొన్నారు. 
 
ఈ సంద‌ర్భంగా స‌ల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ‘‘- సాధార‌ణంగా నేను సినిమా రిలీజ్‌కు ముందే ఇండియాలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌కు వెళ్లి ప్ర‌మోష‌న్స్ చేయ‌డం, ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌డం వంటివి చేస్తుంటాను. అయితే ఇప్పుడు టైగ‌ర్ సినిమా షూటింగ్ కార‌ణంగా ఈసారి నాకు టైమ్ కుద‌ర‌లేదు. సినిమాకు మంచి రెస్పాన్స్ వ‌స్తే త‌ప్ప‌కుండా టైమ్ తీసుకుని రావాల‌నుకున్నాను. అందుక‌నే ఇప్పుడు హైద‌రాబాద్ వ‌చ్చాను. ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌కు థాంక్స్ చెప్ప‌డానికి వ‌చ్చాను. ఆయుష్‌ను ప్రేక్ష‌కులు చ‌క్క‌గా రిసీవ్ చేసుకున్నారు. నేను సాధారణంగా స్క్రిప్ట్ ప్రధానంగా చూస్తాను. సినిమా ప్రేక్ష‌కుల‌కు న‌చ్చాలంటే స్క్రిప్ట్ బాగా ఉండాలి. నాకు స్క్రిప్ట్ న‌చ్చ‌క‌పోతే సినిమా చేయ‌ను. అంతిమ్ కాన్సెప్ట్ నాకు బాగా న‌చ్చింది. 
 
webdunia
Fans who came for Salman
ఆయుష్ ఇందులో కీల‌క‌మైన పాత్ర చేశాడు. పాత్ర కోసం చాలా కష్టపడ్డాడు. తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇక‌పై ఇంకా క‌ష్ట‌ప‌డాలి. డిఫ‌రెంట్ స్క్రిప్ట్స్ ఎంచుకోవాలి. థియేట‌ర్స్‌కు ప్రేక్ష‌కుడు రావాలంటే మనం బ‌య‌ట‌కు వ‌చ్చి ప్ర‌మోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయుష్‌లో చాలా ఆస‌క్తి ఉంది. అలాంటి ఆస‌క్తి ఉన్న‌ప్పుడు కొత్త విష‌యాలు నేర్చుకోవాల‌ని అనుకుంటారు. త‌నిప్పుడు అదే చేస్తున్నాడు. నేను ద‌బాంగ్ సినిమాను తెలుగులో డ‌బ్ చేసి విడుద‌ల చేశాం. కానీ అంతిమ్ సినిమాకు అంత స‌మ‌యం లేదు. క‌రోనా కార‌ణంగా..గ్యాప్ తీసుకుని హిందీలోనే సినిమాను పూర్తి చేయాల్సి వ‌చ్చింది. అందుక‌నే ఈసారి డ‌బ్బింగ్‌పై ఫోక‌స్ పెట్ట‌లేదు. అయితే నా త‌దుప‌రి చిత్రాన్ని హిందీ, తెలుగులో విడుద‌ల చేస్తాను. ద‌బాంగ్‌లో నేను చేసిన చుల్‌బుల్ పాండేకు అంతిమ్‌లో చేసిన పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌కు పూర్తి భిన్నంగా డిజైన్ చేశారు. 
 
ఈ సినిమా ప్ర‌ద‌ర్శ‌న స‌మ‌యంలో కొంద‌రు అభిమానులు థియేట‌ర్స్‌లో ట‌పాసులు కాల్చారు. ఆ విష‌యం నా దృష్టికి రావ‌డంతో సోష‌ల్ మీడియా ద్వారా వారిని వ‌ద్ద‌ని వారించాను. అది వ‌ర్క్ అయ్యింది. ఇప్పుడు పాలాభిషేకం కోసం ఉప‌యోగించే పాల‌ను అభిమానులు పేద‌ల‌కు పంచి పెడుతున్నార‌ని తెలిసింది. చాలా మంచి విష‌య‌మది. నేను క్లాస్‌, మాస్‌, మ‌ల్టీప్లెక్ సినిమా చేయాల‌ని ఆలోచించ‌లేదు. మంచి సినిమా చేయాల‌ని అనుకున్నాను. అంతిమ్ క‌థ విన‌గానే చాలా బాగా న‌చ్చింది. దాంతో వెంట‌నే సినిమాను స్టార్ట్ చేశాను. నాకు చిరంజీవిగారు, రామ్‌చ‌ర‌ణ్ మంచి స్నేహితులు, వెంక‌టేశ్ కూడా బాగా తెలుసు. ఇప్పుడు చిరంజీవిగారితో సినిమా చేస్తున్నాను. వెంకటేశ్‌తోనూ సినిమా చేయ‌బోతున్నాను. ఆ వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాను. ఓటీటీ డిఫ‌రెంట్ కంటెంట్‌తో వ‌స్తున్నాయి. అవ‌కాశం వ‌స్తే.. క‌చ్చితంగా ఓటీటీకి కంటెంట్‌ను అందిస్తాను. ఇక ద‌బాంగ్ 4 చేయాల్సి ఉంది. సాజిద్ సినిమా లైన్‌లో ఉంది’’ అన్నారు. 
 
ఆయుష్ శర్మ మాట్లాడుతూ ‘‘స‌ల్మాన్‌ఖాన్‌గారి సినిమా అంటే ఆ రీచ్ మ‌రోలా ఉంటుంది. ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేయ‌డం నా డ్రీమ్ పూర్త‌యిన‌ట్లు ఉంది. సినిమా చేస్తున్న స‌మ‌యంలో కాస్త నెర్వ‌స్‌గా ఫీలయ్యాను. కానీ స‌ల్మాన్‌కి యాక్ట‌ర్స్‌, టెక్నీషియ‌న్స్‌కు ఎలాంటి స‌పోర్ట్ చేయాలో బాగా తెలుసు. త‌ను అలాంటి స‌పోర్ట్‌ను అందించాడు. నా భార్య అర్పిత‌కు సినిమా చాలా బాగా న‌చ్చింది. ముఖ్యంగా నా పెర్ఫామెన్స్  బావుంద‌ని త‌ను చెప్పింది. నేను ప‌ర్టికుల‌ర్‌గా ఇలాంటి సినిమాల‌నే చేయాల‌ని అనుకోవ‌డం లేదు. వైవిధ్యంగా ఉన్న సినిమాల‌ను చేస్తే త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారు. వైవిధ్య‌మైన పాత్ర‌లు కూడా చేయాల‌నుకుంటున్నాను. ఉదాహ‌ర‌ణ‌కు ఈ సినిమా కోసం 16 కిలోలు బ‌రువు పెరిగాను. మూడేళ్ల స‌మ‌యం ప‌ట్టింది’’ అన్నారు.  
 
మ‌హేశ్ మంజ్రేక‌ర్ మాట్లాడుతూ ‘‘సల్మాన్‌ఖాన్‌గారి ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకునే క‌థ‌ను త‌యారు చేశాం. ఇప్పుడు వ‌స్తున్న రెస్పాన్స్ చూస్తుంటే మీకు అర్థ‌మ‌వుతుంది’’ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అఖండ సినిమా ప్రేక్ష‌కుల రియాక్ష‌న్‌పై స్టార్ హీరోలు రియాక్ష‌న్‌