Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫస్ట్ డే ఫస్ట్ షో.. సీక్రెట్ చెప్పిన చిరంజీవి.. కొబ్బరి మట్టతో చితకబాదారు..

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2022 (14:01 IST)
ఫస్ట్ డే ఫస్ట్ షో అనే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. తన జీవితంలో ఫస్ట్ డే ఫస్ట్ షో అనుభవం చాలా దారుణమైందని చిరంజీవి అన్నారు. ఇప్పటివరకు ఎక్కడా ఎవ్వరిముందు చెప్పని ఓ సీక్రెట్ ఇప్పుడు చెబుతా అంటూ చిరంజీవి చెప్పిన సంగతులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
అది ఏ సంవత్సరమో గుర్తు లేదు కానీ ఎన్టీఆర్ గారి రాము సినిమా ఫస్ట్ షో చూడాలని వెళ్లి చావు దెబ్బలు తిన్నామని చిరంజీవి చెప్పారు. ఆ సినిమాకు తనతో పాటు తమ్ముడు నాగబాబును కూడా తీసుకెళ్లానని.. అయితే ఆ సమయంలో నాన్నకు అడ్డంగా దొరికిపోయి దెబ్బలు తిన్నామని చిరు తెలిపారు. 
 
నాన్నగారు మమ్మల్ని ఎప్పుడు సినిమాకు తీసుకెళ్లినా కుర్చీకి తీసుకెళ్లేవారు. అయితే రాము సినిమా కోసం మేము మాత్రం నేల టికెట్ తీసుకొని సినిమా హాలులోకి వెళ్లబోతుండగా ట్విస్ట్. అప్పటికే ఓ షో ముగియడంతో అమ్మానాన్నా ఆ సినిమా చూసి బయటకొస్తూ మమ్మల్ని చూశారు.
 
అంతే.. నాగబాబు బిక్కముఖం వేశాడు. వాడికి ఒళ్ళంతా చెమట పట్టింది. ఇక ఇంటికి తీసుకెళ్లి కొబ్బరి మట్ట తీసుకొని చితకబాదారు నాన్న. రోడ్డుపై ఉరికించి కొట్టారు. అంత చిన్నవాడిని (నాగబాబు) తీసుకొని సినిమాకు వెళ్లడం, పైగా నేల టికెట్ తీసుకోవడం ఏంటి? వాడిని తొక్కేస్తే ఎలా అంటూ నా మీద కోపగించుకున్నారు అని చిరంజీవి చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments