ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవనానికి ఈ ఆధ్యాత్మిక సూచనలను పాటిస్తే సరిపోతుంది. మంగళవారం పూట అన్నదానం చేయడం ద్వారా కుమార స్వామి అనుగ్రహం లభిస్తుంది. ఆ రోజున ఇంట ఉదయం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో దీపాన్ని వెలిగించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి.
ప్రమిదలతో నేతి దీపాన్ని వెలిగించడం విశేషం. అలాగే ఆలయంలో ఐదు వత్తులతో నేతి దీపాన్ని గురువారం వెలిగించడం విశేష ఫలితాలను ఇస్తుంది. రోజూ దీపం వెలిగించే వారికి సంతాన ప్రాప్తి చేకూరుతుంది. వివాహ అడ్డంకులు తొలగిపోతాయి. సకల సంపదలు చేకూరుతాయి.
వినాయక స్వామికి బుధ, గురువారాల్లో ఏడు దీపాలను, కుమార స్వామికి 6, పెరుమాళ్ల వారికి ఆరు, నాగమ్మకు 4, శివునికి 3 లేదా తొమ్మిది, అమ్మవారికి 2, మహాలక్ష్మికి 8 దీపాలను వెలిగించాలి. దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేసుకోవాలంటే.. రాహుకాలంలో దుర్గమ్మకు దీపం వెలిగించాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.