Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆరోగ్యానికి 4 చిట్కాలు చెపుతున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

pink salt
, గురువారం, 25 ఆగస్టు 2022 (23:08 IST)
పోషకాహార లోపం, అధిక బరువు, ఊబకాయం, అలాగే మధుమేహం, గుండె జబ్బులు, స్ట్రోక్, క్యాన్సర్ వంటి అసంక్రమిత వ్యాధుల నుండి రక్షించడానికి ఆరోగ్యకరమైన ఆహారం సహాయపడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటుంది. సరైన ఆరోగ్యం కోసం ఈ చిట్కాలను గుర్తుంచుకోండి అని చెపుతోంది.

 
చిట్కా 1: ఉప్పును తగ్గించండి. చక్కెరను పరిమితం చేయండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఉప్పు- చక్కెర తీసుకోవడం పరిమితం చేయడం వలన బరువు పెరగడం, మధుమేహంతో పాటు మరెన్నో అసంక్రమిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

 
చిట్కా 2: సంతృప్త కొవ్వు- ట్రాన్స్-ఫ్యాట్ తీసుకోవడం పరిమితం చేయడం లేదా తగ్గించడం చాలా ముఖ్యం. అధిక కొవ్వు తీసుకోవడం వల్ల రక్తపోటు, ఆరోగ్య సమస్యలు, వ్యాధులకు దారితీయవచ్చు.

 
చిట్కా 3: సమతుల్య ఆహారం ఆరోగ్యకరమైన జీవనానికి కీలకం. ఆరోగ్యకరమైన పిండి పదార్థాలు, కొవ్వులు, ఫైబర్, ప్రొటీన్లు, అవసరమైన ఖనిజాలు, విటమిన్లతో కూడిన కూడిన భోజనం మనలో రోగనిరోధక శక్తిని కలిగి ఉంటుంది. లోపల నుండి మనల్ని పోషించడంలో సహాయపడుతుంది. ఇది శరీరం యొక్క మొత్తం పెరుగుదలకు మరింత సహాయపడుతుంది.

 
చిట్కా 4: హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. నీరు, తాజా పండ్ల రసం మొదలైనవి ఆరోగ్యానికి మంచివి. అయితే, చక్కెర పానీయం, ఆల్కహాల్, అదనపు కెఫిన్ మన శరీరంపై ప్రతికూలంగా పనిచేస్తాయి. కనుక వాటిని తగ్గించేయాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చూపుడు వేలు కంటే ఉంగరపు వేలు పొడవుగా వుందా? ఐతే అలాంటి పురుషులు...