Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒమిక్రాన్‌తో జాగ్రత్తగా ఉండాలి.. ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్నింగ్

ఒమిక్రాన్‌తో జాగ్రత్తగా ఉండాలి.. ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్నింగ్
, బుధవారం, 29 డిశెంబరు 2021 (15:24 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వైరస్‌తో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ హెచ్చరించారు. ఈ కొత్త వేరియంట్ మరో రెండు మూడు రోజుల్లో మరింత శరవేగంగా వ్యాపించే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వైరస్ ఇప్పటికే అగ్రదేశం అమెరికాతో పాటు యూకే వంటి దేశాల్లో అల్లకల్లోలం సృష్టిస్తుందని గుర్తుచేశారు. డిసెంబరు 20వ తేదీ నుంచి 26వ తేదీలోపు ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగాయని ఆయన గుర్తుచేశారు. అంతేకాకుండా, వచ్చే 2, 3 రోజుల్లో ఈ వైరస్ మరింతగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. 
 
మరోవైపు, ఈ వైరస్ భారత్‌లోనూ తీవ్ర ప్రభావం చూపుతోంది. మంగళవారం ఒక్క రోజే ఏకంగా 127 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 750ను దాటిపోయింది. ముఖ్యంగా, భారత్‌లో గత వారం వరకు కేవలం 7లోపు మాత్రమే ఉన్న ఈ పాజిటివ్ కేసుల సంఖ్య ఈ వారంలో ఏకంగా ఏడు వందలకు పైగా నమోదయ్యాయని టెడ్రోస్ హెచ్చరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ నాయ‌క‌త్వం ఇక యువ‌త‌రానికి!