Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సోము వీర్రాజు లిక్కర్ స్కీమ్.. కేటీఆర్ సెటైర్లు.. వాహ్‌.. ఎంత గొప్ప‌ పథకం..?

Advertiesment
what a scheme
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో సెటైర్లకు దారితీశాయి. ఏపీలో తాము అధికారంలోకి వస్తే ఆల్కహాల్ క్వార్టర్ సీసాను రూ.50కే విక్రయించేలా చర్యలు తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హామీ ఇచ్చారు. దీనిపై తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ప్ర‌ముఖులు సెటైర్లు వేస్తున్నారు.
 
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ట్విట్టర్ లో దీనిపై సెటైర్‌లు వేశారు. అలాగే  సోము వీర్రాజు మాట్లాడిన ఆ వీడియోను పోస్టు చేశారు. 'వాహ్‌.. ఎంత గొప్ప‌ పథకం.. ఎంత సిగ్గుమాలిన హామీ.. బీజేపీ ఏపీ నైతిక‌త విష‌యంలో మ‌రింత దిగ‌జారింది. చీప్ లిక్కర్‌ను రూ.50కి సరఫరా చేయాలనేదే బీజేపీ జాతీయ విధాన‌మా? లేదంటే నిరాశ అధికంగా ఉన్న‌ రాష్ట్రాలకు మాత్రమే బీజేపీ ఈ బంపర్ ఆఫర్ ఇస్తుందా?' అని ఎద్దేవా చేశారు.  
 
కాగా, దేశంలోని ఎన్డీయేత‌ర పార్టీల‌కు చెందిన ప‌లువురు నేత‌లు కూడా సోము వీర్రాజు చేసిన వ్యాఖ్య‌ల‌పై చుర‌క‌లు అంటిస్తున్నారు. ఇంత గొప్ప ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్ట‌నున్న బీజేపీకి భ‌విష్య‌త్తులో ఇంకా ఎన్ని మంచి ఆలోచ‌న‌లు వ‌స్తాయో అంటూ సెటైర్లు వేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్ ను స‌న్మానించిన సీఎం జ‌గ‌న్