Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గ‌తంలో అందుకోని వారికి ఇపుడు జ‌గ‌న‌న్న తోడు...

Advertiesment
home minister mekathoti sucharitha
విజ‌య‌వాడ‌ , మంగళవారం, 28 డిశెంబరు 2021 (14:52 IST)
ఏదైనా కార‌ణం వ‌ల్ల గ‌తంలో ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను పొంద‌లేని అర్హుల‌కు, ఇపుడు మ‌ళ్ళీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మూడో విడ‌త జ‌గ‌న‌న్న తోడు క‌ల్పిస్తోంది. గుంటూరు కలెక్టరేట్ లో జరిగిన జగనన్న తోడు మూడవ విడత ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు ముస్తఫా, మేరుగు నాగార్జున, ఉండవల్లి శ్రీదేవి, మద్దాలి గిరిధర్, జడ్పీ ఛైర్మన్ హెనీ క్రిస్టినా, కలెక్టర్ వివేక్ యాదవ్, జేసీ దినేష్ కుమార్, కార్పొరేటర్లు, జడ్పీటీసీ లు, ఇతర వైస్సార్సీపీ నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. 
 
 
అర్హులైనప్పటికి వివిధ కారణాల వలన సంక్షేమ పథకాలు అందని వారికి నగదు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారిని శాచ్చురేషన్ పద్దతిలో గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9 లక్షల మంది ఈ రోజు వివిధ పథకాల ద్వారా లబ్ది పొందారు. దాదాపు 702 కోట్ల రూపాయలను అర్హులైన వారికి సీఎం చేతుల మీదుగా అందించడం జరుగుతోంద‌ని మంత్రి సుచ‌రిత తెలిపారు. 

 
గుంటూరు జిల్లాలో వైఎస్సార్ సున్నా వడ్డీ 5 కోట్ల 35 లక్షలు, ఆసరా 30 లక్షలు, చేయూత 33 కోట్ల 26 లక్షలు, నేతన్న నేస్తం 5లక్షలు, కాపు నేస్తం కింద 3 కోట్ల 52 లక్షల నగదును లబ్దిదారులకు ఇచ్చారు. అర్హత ఉండి ఇళ్ల పట్టాలు పొందని వారిని కూడా గుర్తించి, ఈ రోజు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చామ‌ని మంత్రి తెలిపారు. అర్హత ఉన్న ఏ ఒక్కరు కూడా నష్టపోకూడదనే సదుద్దేశంతో సీఎం ఈ కార్యకమాన్ని చేపట్టార‌న్నారు.  
 
 
వన్ టైం సెటిల్మెంట్ పై టీడీపీ కావాలనే దుష్ప్రచారం చేస్తోంద‌ని, వాలంటీర్లు బలవంతంగా వసూలు చేస్తున్నారని విషప్రచారాన్ని చేస్తున్నార‌ని మంత్రి ఆరోపించారు. రాష్ట్రంలో 1983 లో కట్టిన ఇళ్లకు కూడా పట్టాలు రాని వారిని 48 లక్షల మందిని గుర్తించామ‌ని, అలాంటి వారందరికీ ఓటిఎస్ ద్వారా పట్టాలు పొందడం ఒక వరం లాంటిదన్నారు. రుణం లేని వారికి కేవలం 10 రూపాయలకే ఇల్లు రిజిస్ట్రేషన్ చేయిస్తున్న సౌకర్యాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి కల్పిస్తున్నార‌ని చెప్పారు. చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి ఉంటే తమ హయాంలో ఈ సమస్యను ఎందుకు పరిష్కరించలేద‌ని ప్ర‌శ్నించారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలకృష్ణ ఇంటి ముట్టడికి వైకాపా నేతల యత్నం.. ఉద్రిక్తత