విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగే జనాగ్రహ బహిరంగసభ తొలి అడుగుతో, జగన్ పాలన పతనానికి నాంది పలుకుతుందని ఏపీ బీజేపీ నాయకులు చెప్పారు. పూర్వం భస్మాసురుడు, నరకాసురుడు, మహిషాసురుడు, రావణాసురులే, నేటి యుగంలో జగనాసురుడు అవతారం అని అభివర్ణించారు.
చేతగాని అసమర్థ పాలనతో వ్యవస్థలన్నీ నిర్వీర్యం భస్మాసురుడులాగే జగనాసురుడు భస్మం కావడం తద్యం అన్నారు. 75ఏళ్ల స్వతంత్ర దేశంలో ఇంతటి దుర్మార్గ అరాచక అక్రమాలతో జగన్ కక్ష సాధింపు పాలన ఎవరూ చూడలేదన్నారు. విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగే జనాగ్రహ బహిరంగసభ ఏపీలో పాలనకు చరమాంకం పాడుతుందని చెప్పారు.
బీజేపీ మూడు రోజుల శిక్షణ సమావేశాల్లో రాష్ట్ర అధికార ప్రతినిధిలు భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ లో జగన్ పాలనపై ధ్వజమెత్తారు. ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని మార్చేస్తా అని, రాష్ట్రాన్ని అప్పుల ప్రదేశ్, అంధకార ప్రదేశ్ గా మార్చి సర్వనాశనం చేసిన తుగ్లక్ రెడ్డి జగన్ అని ఆరోపించారు. దివాలా తీసిన ఖజానాను నింపుకోవడానికి ఎపుడో కట్టిన ఇళ్లకు ఓటీఎస్ పేరుతో బలవంత వసూళ్లతో పేదలను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.
బిజేపీ జిల్లా అధ్యక్షుడు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కండ్రిగ ఉమ, జాతీయ కార్యవర్గ మాజీ సభ్యులు శాంతారెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ముని సుబ్రమణ్యం, మండల అధ్యక్షుడు పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి ఆనంద్, సీనియర్ నాయకులు సుబ్బ రత్నమ్మ, భాస్కర్ రెడ్డి, సిద్దులయ్య, మోర్చా నాయకులు ఏసు (నారాయణ), సత్యవేడు నాగలాపురం పిచాటుర్, కండ్రిగ, కేవీబీ పురం, నారాయణ వనం మండలాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.