Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బెజ‌వాడ‌లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జయంతి

Advertiesment
former prime minister
విజ‌య‌వాడ‌ , శనివారం, 25 డిశెంబరు 2021 (17:46 IST)
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జయంతి సందర్భంగా బీజేపీ సుప‌రిపాల‌న దినోత్స‌వాన్ని నిర్వ‌హించింది. బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సోము వీర్రాజు వాజ్ పేయి చిత్ర ప‌టానికి పూల‌మాల వేశారు. స‌త్య‌న్నారాయణ పురం శివాజి కేఫ్ సెంటర్ లో సుపరిపాలన దినం ఘనంగా నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యుడు  ఉప్పలపాటి శ్రీనివాసరాజు మాట్లాడుతూ, ప్రధానిగా వాజపేయిని స్మరించుకోవడం ముదావహం అని చెప్పారు. స్వర్ణ చతుర్భుజి, ప్రధాన మంత్రి అవస్ యోజన, ప్రధాన మంత్రి సడక్ యోజన, వంటి అనేక పథకాలతో దేశాన్ని అభివృధి పదం లోకి తెచ్చారని, ఇప్పుడు ప్రధాని మోడీ అయన ఆశయాయలను, పథకాలను మరింత వేగవంతం చేసి దేశాన్ని ప్రపంచంలో మేటిగా నిలిపారని శ్లాఘించారు. 
 
 
ఈ కార్యక్రమంలో పాల్గొన్న భాజపా యువమోర్చ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్ర మోహన్ వాజపేయి చేసిన సేవలను స్మరించుకున్నారు. యువజన నాయకుడు నాగలింగం శివాజి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తంగిరాల రాఘవ శాస్త్రి, సత్యనారాయణ పురం భాజపా అధ్యక్షుడు బాచిమంచి రవి కుమార్, జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ బోగ్గరపు సత్యనారాయణ , ఓబీసీ సెల్ అధ్యక్షుడు శ్రీ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంకుల్ అని పిలిచిన పాపానికి 18 ఏళ్ల బాలికపై దాడి