Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమ‌ల ద‌ర్శనానికి శ్రీలంక ప్ర‌ధాని రాజ‌ప‌క్సే రాక‌

Advertiesment
republic of sri lanka
విజ‌య‌వాడ‌ , గురువారం, 23 డిశెంబరు 2021 (14:52 IST)
కొలంబో నుంచి నేరుగా తిరుమ‌ల‌కు శ్రీలంక ప్రధానమంత్రి వ‌చ్చారు. ఆయ‌న‌కి భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో ఏపీ ప్ర‌భుత్వం ఘన స్వాగతం ప‌లికింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం కొలంబో విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో గురువారం మద్యాహ్నం 11.37 గం. రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. డెమోక్రటిక్ సోషియలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక ప్రధాన మంత్రి  మహింద రాజపక్సేకి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల, సంగీత నృత్యాలతో ఘన స్వాగతం లభించింది. 

 
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కె.నారాయణ స్వామి, జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్, తిరుపతి ఆర్డిఓ కనక నరసా రెడ్డి, తిరుపతి స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, అర్బన్ ఎస్.పి వెంకటప్పల నాయుడు, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్  సురేష్ , చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ రాజశేఖర్ రెడ్డి,  జిల్లా అధికారులు శ్రీలంక ప్ర‌ధానికి స్వాగతం పలికారు. అనంతరం శ్రీలంక ప్రధాని రోడ్డు మార్గాన తిరుమల బయలు దేరి వెళ్ళారు. శుక్రవారం ఉదయం  తన కుటుంబసభ్యులతో కలసి తిరుమల  శ్రీవారిని దర్శించుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గూడెం గ్రామంలో ఒమిక్రాన్ కలకలం - 10 రోజుల లాక్డౌన్