Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యూపీలో ప్రధాని పర్యటన: రూ.800 కోట్ల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

Advertiesment
యూపీలో ప్రధాని పర్యటన: రూ.800 కోట్ల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
, సోమవారం, 13 డిశెంబరు 2021 (11:37 IST)
యూపీలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. దాదాపు రూ.800 కోట్ల వ్యయంతో నిర్మించిన కాశీ విశ్వనాధ్ కారిడార్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. యూపీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రధాని మోదీ వరసగా ఆ రాష్ట్ర పర్యటనలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మోదీ పర్యటన కోసం విస్తృత బందోబస్తును ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ప్రధాని వరస శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
 
ఈ పర్యటనలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని ‘కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ ప్రాజెక్టును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. కాశీ విశ్వనాథ్‌ ఆలయాన్ని గంగా ఘాట్లతో ఈ ప్రాజెక్టు అనుసంధానం చేస్తుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి దివ్యకాశీ-భవ్యకాశీగా నామకరణం చేశారు. ప్రధాని పర్యటన సందర్భంగా నగరం మొత్తాన్ని అధికారులు సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయాలు, వీధులన్నింటినీ విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు ఏపీ హైకోర్టు అదనపు భవనాలకు శంకుస్థాపన