Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 11 April 2025
webdunia

అత్యుత్సాహంతో నా హత్యకు కుట్ర పన్నారు : వంగవీటి రాధా

Advertiesment
Vijayawada
, ఆదివారం, 26 డిశెంబరు 2021 (17:35 IST)
బెజవాడకు చెందిన వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి వంగవీటి రంగా వర్థంతిని పురస్కరించుకుని ఆయన కృష్ణా జిల్లా చిన్నగొన్నూరులో విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యుత్సాహం కొద్ది ఏదో చేద్దామని చెప్పి తనను చంపాలని చూశారన్నారు. దీని కోసం రెక్కీ కూడా నిర్వహించారని చెప్పారు. వారు ఎవరో త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. 
 
రంగా కుమారుడిగా జనంలోనే ఉంటా.. జనంతోనే ఉంటానన్నారు. ఎవ్వరు ఏ వెదవ వేషాలు వేద్దామని చూసినా ఆది జరగదన్నారు. తన అభిమానులు కూడా అలాంటి వాటికి దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. సమయం వచ్చినపుడు అన్ని విషయాలు బహిర్గం చేస్తానని ప్రకటించారు. 
 
వంగవీటి రాధాతో వల్లభనేని వంశీ భేటీ 
బెజవాడ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. దివంగత వంగవీటి మోహన రంగా తనయుడు వంగవీటి రాధాతో టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆదివారం సమావేశమయ్యారు. వీరిద్దరి ఆసక్తిర భేటీ ఇపుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 
 
గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా వంగవీటి రాధా ఉంటున్నారు. అలాంటి రాధాను వల్లభనేని వంశీ కలవడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత వంగవీటి రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, వర్థంతి వేడుకల్లో పాల్గొన్నారు. 
 
చాలా కాలం తర్వాత వంగవీటి రాధా, వల్లభనేని వంశీలు కలుసుకోవడం ఇపుడు చర్చనీయాంశంగానూ, ఆసక్తికగానూ మారింది. కాగా, మూడు నెలల క్రితం కూడా వంగవీటి రాధా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మంత్రి కొడాలి నానితో కలిసి పాల్గొన్న విషయంతెల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిలయన్స్ జియో నుంచి న్యూ ఇయర్ ఆఫర్స్