Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ చిరంజీవి -గాడ్ ఫాదర్ ఊటీ షెడ్యూల్ ప్రారంభమైంది

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (19:19 IST)
chiru
మెగాస్టార్ చిరంజీవి 153వ సినిమాను మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ కలిసి సంయుక్తంగా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గాడ్ ఫాదర్ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. చిరంజీవి బర్త్ డే సందర్బంగా ఆగస్ట్ 22న విడుదల చేసిన గాడ్ ఫాదర్ టైటిల్ మోషన్ పోస్టర్‌కు సోషల్ మీడియాలో అధ్బుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో చిరంజీవి కనిపించబోతోన్నారు.
 
మెగాస్టార్ సినిమా అంటే అభిమానులకు ఎలాంటి అంచనాలుంటాయో తెలిసిన దర్శకుడిగా మోహన్ రాజా.. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాకు మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేశారు. ఈ మూవీ షూటింగ్ గత నెలలో హైద్రాబాద్‌లో ప్రారంభమైంది. ఆ షెడ్యూల్ లో మెగాస్టార్ మీద పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కించారు.
 
తాజాగా ఈ మూవీ కొత్త షెడ్యూల్ ఊటీలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో చిరంజీవి, ఇతర ముఖ్య తారాగణం మీద కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. మాస్టర్ సినిమాటోగ్రఫర్ నీరవ్ షా కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక తమన్ అధ్బుతమైన సంగీతాన్ని అందించేందుకు సిద్దమయ్యారు. సురేష్ సెల్వరాఘవన్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మోహన్ రాజా, నిర్మాతలు: ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్,  సమర్ఫణ : కొణిదెల సురేఖ, బ్యానర్స్ : కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్, సంగీతం  : ఎస్ఎస్ తమన్, సినిమాటోగ్రఫర్  : నీరవ్ షా, ఆర్ట్ డైరెక్టర్  : సురేష్ సెల్వరాఘవన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వాకాడ అప్పారావ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments