Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెడిసికొట్టిన వ‌ర్మ ఫొటో ఇంట‌ర్వ్యూ

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (19:03 IST)
Varma-Ashu reddy
ఎలాంటివాడు ఎలా అయిపోయాడు అనేది మ‌నకు తెలిసిన‌వాడు డౌన్‌ఫాల్ అయితే అనే మాటే. ఇప్పుడు అది రామ్‌గోపాల్ వ‌ర్మ‌కు స‌రిపోయేట్లువుంద‌ని సినీవ‌ర్గాలు తెలియ‌జేస్తున్నాయి. శివ సినిమాతో యూత్‌ను త‌న‌వైపు ఆక‌ట్టుకున్న వ‌ర్మ ఆ త‌ర్వాత కొన్ని మంచి సినిమాలు తీశాడు. ఆ త‌ర్వాత మాఫియా సినిమాల‌తోపాటు సెక్స్‌, హ‌ర్ర‌ర్ సినిమాలు చేశాడు. కానీ ఇప్పుడు త‌నతో సినిమాలు చేయ‌డానికి చిన్న నిర్మాత‌లు ఒక‌రిద్ద‌రు మిన‌హా ఎవ‌రూ లేరు. అందుకే సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎదో ఒక‌టి చేస్తూ వార్త‌లో వుంటున్నాడు. అలా చేసి మ‌ళ్ళీ ఫామ్‌లో వున్నాన‌ని త‌న‌కుతానే చెప్పుకుంటున్నాడు.
 
ఆ భాగంలోనే బిగ్ బాస్ ఫైనలిస్ట్ అరియానాతో చేసిన ఇంటర్వ్యూ వైర‌ల్ కావ‌డంతో అదే దూకుడుతో అషురెడ్డితో బోల్డ్ ఇంటర్వ్యూ చేశాడు. దానిపై ప‌లు విమ‌ర్శ‌లు వ‌చ్చినా. అది నా ఇష్టం. లా ప్ర‌కారం నేను చేస్తున్నానంటూ ఓ టీవీకి ఇచ్చిన ఇంట‌ర్వూలో చెప్పాడు. పైగా ఇలాంటి బోలెడు వ‌స్తాయంటూ నిర్మొహ‌మాటంగా చెప్పాడు. అయితే ఈ ఇంట‌ర్వ్యూ ఇషూ రెడ్డి మ‌ద‌ర్ కూడా ఓకే అంద‌ని చెప్పాడు. కానీ ఆయ‌న మాట‌కు విరుద్ధంగా ఇషురెడ్డి కుటుంబం వ‌ర్మ‌పై తీవ్రంగా విరుచుకుప‌డ్డార‌ని తెలుస్తోంది. బిగ్ బాస్ తర్వాత వెండితెరపై వెలగాలని అషు ఆశపడిన మాట వాస్త‌మే. కానీ ఇలా అయితే పూర్తి నెగెటివ్ పేరు వ‌స్తుందేమోన‌ని భ‌యంతో వున్నారు. ఇక‌పై వ‌ర్మ సినిమాల్లో కూడా న‌టించ‌వ‌ద్ద‌ని కుటుంబీకులు చెప్పిన‌ట్లు స‌మాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

ప్రభాస్‌తో అక్రమ సంబంధం అంటగట్టింది మీరు కాదా జగన్ రెడ్డీ? వైస్ షర్మిల (Video)

ఆ రెండు బీఎండబ్ల్యూ కార్లు మిస్.. ఏమయ్యాయో చెప్పండి.. పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం