Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఆర్ఆర్. టీష‌ర్ట్‌ల మార్కెటింగ్ జ‌రుగుతోంది

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (18:44 IST)
RRR-T-shirts
రాజ‌మౌళి త‌న సినిమాల‌కు సంబంధించిన ప్ర‌మోష‌న్‌ను విభిన్నంగా చేస్తూ వుంటాడు. బాహుబ‌లికి కూడా త‌న దైన శైలిలో కీలు, వాచ్‌లు, టీష‌ర్ట్‌లతోపాటు కామిక్ బుక్స్ వంటివి ప్ర‌యోగాలు చేశాడు. ఇప్పుడు తాజాగా ఆ ప్ర‌క్రియ ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమాకు చేయ‌బోతున్నారు. సినిమా ఎలాగూ ఆల‌స్యం అయ్యేట్లు వుంది క‌నుక ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమాకు సంబంధించిన వ‌స్తువుల‌పై వ్యాపారం మొద‌లు పెట్టింది. దీనిలో భాగంగా రానా దగ్గుబాటి ఈ వ్యాపారపు తొలి కలెక్షన్‌ను ఆవిష్క‌రించాడు. దీనికి సంబంధించిన టీష‌ర్ట్‌లు ఫొటోలు ట్విట్ట‌ర్‌లో రానా పోస్ట్ చేశాడు. ఈ కలెక్షన్ లో భాగంగా టీ షర్ట్స్, కాఫీ మగ్స్, పోస్టర్స్, బ్యాడ్జెట్స్ తో పాటు ఫేస్ మాస్కులు కూడా అందుబాటులో ఉన్నాయి.
 
ఇక టీ-షర్టుల ధరను రూ .599 గానూ, కాఫీ మగ్స్ రూ .399 కి అందుబాటులో ఉన్నాయి. కాగా, ఈ సినిమాకు వంద‌ల కోట్ల రూపాయ‌లు నిర్మాత‌లు ఖ‌ర్చు చేశారు. కోట్ల రూపాయ‌లు హీరోలు, ద‌ర్శ‌క టీమ్ తీసుకున్నారు. దానికి త‌గిన‌ట్లే వ్యాపారం కూడా జ‌రిగింది. ఇక సినిమా ఆల‌స్యం అవుతుంది కాబ‌ట్టి ఈలోగా ప‌లు ర‌కాలుగా బిజినెస్‌ను చిత్ర యూనిట్ మొద‌లు పెట్టింది. అస‌లు మొద‌లు అనుకున్న‌ట్లు ఈ సినిమా ద‌స‌రాకు విడుద‌ల కావాల్సింది. కానీ కార‌ణాలు అనుకూలించ‌లేదు. త‌దుప‌రి డేట్ త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం- ప్రతి 2 నిమిషాలకు మహిళ మృతి.. కారణం అదే..

భర్తను ప్రాంక్ చేసిన భారతీయ మహిళ.. రూ.77,143 విలువైన కీచైన్ కొనిందట (వీడియో వైరల్)

ఊబకాయం వద్దు.. జీవనశైలిని మార్చండి.. ఫిట్‌గా వుండండి.. ప్రధాని పిలుపు

బాలికకు మాయమాటలు చెప్పి ప్రత్యేక శిక్షణ పేరుతో అత్యాచారం.. బ్యాడ్మింటన్ కోచ్ అరెస్టు!!

గర్భిణి భార్య కడుపుపై కాలితో ఎగిసితన్ని.. సిమెంట్ ఇటుకతో భర్త దాడి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments