Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హ‌నీ ట్రాప్‌కు సెన్సార్ రాద‌ని భ‌య‌ప‌డ్డాం. కానీ వ‌చ్చింది. ఎందుకో తెలుసా!

హ‌నీ ట్రాప్‌కు సెన్సార్ రాద‌ని భ‌య‌ప‌డ్డాం. కానీ వ‌చ్చింది. ఎందుకో తెలుసా!
, మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (14:21 IST)
Honey Trap stills
హ‌నీ అనే అమ్మాయి మ‌గ‌వారిని ఏవిధంగా ట్రాప్‌లో పెట్టి వారిని బ్లాక్ మెయిల్ చేసింద‌నేది కాన్సెప్ట్‌తో `హ‌నీ ట్రాప్‌` సినిమా రూపొందింది. ఇందుతో మోతాదుకు మించిన శృంగార స‌న్నివేశాలు, డైలాగ్స్‌లో కూడా ట్రైల‌ర్ ద్వారా విడుద‌ల చేశారు. లిప్‌కిస్‌లు, బాడీ మ‌సాజ్ వంటివ‌న్నీ ఇందులో ద‌ర్శ‌కుడు పొందుప‌ర్చారు. ద‌ర్శ‌కుడు ఇంత‌కుముందు రొమాంటిక్ క్రైమ్ క‌థ వంటి సినిమాలు తీశారు. అలాగే గంత‌పుత్రులు వంటి సినిమాలు కూడా తీశారు. ఫైన‌ల్‌గా యూత్‌ఫుల్ శృంగారానికి ఈమ‌ధ్య పెద్ద పీఠ వేస్తున్నారు. అదేమ‌ని అడిగితే, థియేట‌ర్‌కు రావాలంటే యూత్ క‌నుక ఆ చిత్రాలు తీస్తున్న‌ట్లు చెప్పారు. అంత‌కుముందు సందేశాత్మ‌క సినిమా తీసి చేతులు కాల్చుకున్నామ‌ని వెల్ల‌డిస్తున్నారు.
 
తాజాగా హనీ ట్రాప్ సినిమా నేటి యువతను చైతన్యవంతులను చేస్తుందని నిర్మాత వి వి వామన రావు, ద‌ర్శ‌కుడు సునీల్‌కుమార్ తెలియ‌జేస్తున్నారు. స‌మాజంలో జ‌రిగే క‌థ‌ను తీసుకున్నామ‌నీ, ఆమ‌ధ్య ఇండియాన్ సైన్యాధికారిని బుట్ట‌లేవేసుకున్న ఓ పాకిస్తాన్ యువ‌తి క‌థ‌ను చ‌దివాక ఆలోచ‌న వ‌చ్చింద‌ని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలోకూడా ఐ.ఎ.ఎస్‌. వంటి అధికారుల‌ను కూడా యువ‌తులు మాయ‌మాట‌ల‌తో ఎలా బుట్ట‌లో వేస్తార‌నేది ఈ సినిమాలో చూపించామ‌ని తెలిపారు. ఆ ద‌శ‌లో శృంగారం చూపించామ‌న్నారు. క‌నుక సెన్సార్ వారు అభ్యంత‌రం పెడ‌తార‌ని భ‌య‌ప‌డ్డాం. కానీ వారే ఎటువంటి క‌ట్ లేకుండా ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చారు. ఇది సెంట్ర‌ల్ సెన్సార్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా శృంగారం వుంద‌ని వారు మెచ్చుకోవ‌డం ఆనందంగా వుంద‌ని తెలియ‌జేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం జగన్ నుంచి చిరంజీవికి పిలుపు - 20న భేటీ