Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోళా శంకర్‌ లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్న మెగాస్టార్ చిరంజీవి, కీర్తి సురేష్

Webdunia
శనివారం, 29 జులై 2023 (17:31 IST)
Megastar Chiranjeevi and Keerthy Suresh
మెగాస్టార్ చిరంజీవి మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ 'భోలా శంకర్‌'. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా  కథానాయికగా నటిస్తుండగా, చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు 14.5 M+ వ్యూస్ తో వీడియో టాప్ ట్రెండింగ్‌లో ఉంది.
 
చిరంజీవి స్వాగ్, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీ అభిమానులు, మాసెస్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. భోళా శంకర్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయని ట్రైలర్ ద్వారా అర్థమైంది. అయితే ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. అన్న చెల్లెల బంధం సినిమాకు ప్రధాన ఆకర్షణ.
 
అన్న చెల్లెలుగా చిరంజీవి, కీర్తి సురేష్‌ల సీక్వెన్స్‌లు సినిమాకు బలంగా నిలుస్తాయి. వీరిద్దరూ బ్యూటీఫుల్  కెమిస్ట్రీని పంచుకున్నారు. ఈ రెండు పాత్రల మధ్య హ్యుమర్, డ్రామా, భావోద్వేగాలు ఉంటాయి. కాబట్టి, భోళా శంకర్ ఒక వర్గం ప్రేక్షకులకు పరిమితం కాదు. మాస్‌, యూత్‌, ఫ్యామిలీస్‌ని సమానంగా ఆకట్టుకునే సినిమాగా ఉంటుంది.
 
అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం, డడ్లీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.
 
భోళా శంకర్ ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments