మెగాస్టార్ చిరంజీవి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర గ్రాండ్‌గా నిర్మిస్తున్న ఈ చిత్రం మెగా మాసీవ్ ప్రమోషనల్ కంటెంట్ తో స్ట్రాంగ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. టీజర్ నుంచి పాటల వరకు సినిమాకు సంబంధించిన ప్రతి ప్రమోషనల్ ఎలిమెంట్ తో ఆకట్టుకున్న మేకర్స్ ఈ రోజు థియేట్రికల్ ట్రైలర్ తో ముందుకు వచ్చారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ట్రైలర్ ని లాంచ్ చేశారు.
ఇటీవలే ట్రైలర్ లో చిరంజీవి వింటేజ్ అవతార్‌లో కనిపించి తన మాస్ పవర్‌ను మరోసారి చూపించారు. యాక్షన్‌తో పాటు వినోదాత్మక సన్నివేశాలలో కూడా ఎక్స్ టార్డినరిగా వున్నారు. ఆగస్ట్ 11న థియేటర్లలో మెగా ఫెస్టివల్ రాబోతుంది. ఇప్పటికే పలు చోట్ల చిరంజీవి కటౌట్ కట్టారు. కాగా, అత్యధిక కటౌట్ ను తెలుగు లో ఇంతవరకు రాణి విధంగా భారీగా కట్టారు. సూర్యాపేట రాజు గారి తోటలో మెగా భారీ కటౌట్ ప్రారంభం అయింది. ఇది మెగా అభిమానాలు సందడి నెలకొంది.