Bhola Shankar Trailer poster
భోళా శంకర్ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను కొద్దిసేపటి క్రితమే రాంచరణ్ ట్విట్టర్ లో విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భోళా శంకర్. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. రామబ్రహ్మం సుంకర భారీ కాన్వాస్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రం మెగా మాసీవ్ ప్రమోషనల్ కంటెంట్ తో స్ట్రాంగ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. టీజర్ నుంచి పాటల వరకు సినిమాకు సంబంధించిన ప్రతి ప్రమోషన్ ఎలిమెంట్ హ్యుజ్ బజ్ నెలకొల్పింది.
ట్రైలర్‌ని రామ్ చరణ్ లాంచ్ చేయడం వల్ల ఇది సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. ఇందులో ఏముందంటే.. సిటీలో వరుసగా బాలికలు కిడ్నాప్ అవుతుంటారు. పోలీస్ లకు సవాల్ గా మారుతుంది. ఓ రౌడీని భోళా శంకర్ నిలదీస్తే నా వెనుక పెద్ద మాఫియా ఉందని అంటారు. ఆ తర్వాత తన సిస్టర్ కీర్తి సురేష్ ను గ్యాంగ్ అటాక్ చేస్తుంది. ఇది చూసిన భోళా శంకర్ విల్లన్ పై వారి గ్యాంగ్ పై కత్తులతో కసకసా పొడిచేస్తాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావ్.. అని ఓ రౌడీ అంటే.. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి.. హ..హ.. అంతో.. పవన్ మానరిజాన్నీ చూపిస్తాడు భోళా శంకర్. ఈ సినిమా ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మొదటి మూడు పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి.