Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జీవితం చాలా చిన్నది.. అతిగా ఆలోచించకు.. హాయిగా గడిపేయ్ 'బ్రో'.. : సముద్రఖని

జీవితం చాలా చిన్నది.. అతిగా ఆలోచించకు.. హాయిగా గడిపేయ్ 'బ్రో'.. : సముద్రఖని
, గురువారం, 27 జులై 2023 (16:51 IST)
దర్శకనటుడు సముద్రఖని తెరకెక్కించిన చిత్రం "బ్రో". పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్‌ నటించారు. ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతుంది. గతంలో తమిళంలో వచ్చిన "వినోదయ సిత్తం"కు రీమేక్. సూపర్ డూపర్ హిట్. ఇదే కథతో తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చి తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో సముద్రఖని తాజాగా ఈ చిత్రం గురించి వివరించారు. 
 
"ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కారణం కాలం (టైమ్). అదే ఎవరినైనా నడిపించేంది. నిన్న అనేది జరిగిపోయింది. రేపు అనేది ఒక ఆశ మాత్రమే. ఉన్నది ఈ రోజు. హ్యాపీగా గడిపేయడమే మంచిది అనేది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను అని చెప్పారు. 
 
డబ్బున్న వాళ్ళలో కూడా చాలా మంది ప్రశాంతంగా ఉండకపోవడం నేను గమనించాను. ఓ పదేళ్లకు ముందే ప్లాన్ చేసి పెట్టేస్తారు. ఏదో అనుకుంటే చివరకు ఏదో జరుగుతుంది. జీవితం చాలా చిన్నది. అతిగా ఆలోచించకు.. హాయిగా గడిపేయ్ అనేదే బ్రో సినిమా ద్వారా నేను చెప్పింది. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది" అని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్జీవీకి కథ వినిపిస్తే ఆ టైటిల్ పెట్టమన్నారు : స్లమ్ డాగ్ హజ్బెండ్ నటుడు బ్రహ్మాజి